త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Metro Pillar | మ‌ట్టే క‌నిపించిందా.. మెట్రో పిల్ల‌ర్లు క‌నిపించ‌లేదా?.. ఇస్కాన్ స‌మీపంలో త‌వ్వ‌కాల‌పై ఎన్‌హెచ్ఆర్సీకి న్యాయ‌వాది రామారావు ఫిర్యాదు

Metro Pillar | సికింద్రాబాద్‌లోని ఇస్కాన్ ఆలయ (ISKCON Temple) సమీపంలో మెట్రో పిల్లర్ల (C1192, C1193) కింద జరిగిన అక్రమ తవ్వకాల వ్యవహారం క‌ల‌క‌లం సృష్టిస్తున్న‌ది. ప్రమాదకరమైన రీతిలో పిల్లర్ల (Metro Pillar) పునాదుల వద్ద మట్టిని తోడేసిన ఘటనపై మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మనేని (Ramarao Immaneni) జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు (NHRC) ఫిర్యాదు చేశారు.

G

Telangana | Published On Sep 24, 2026, 10.09 am IST

Metro Pillar | మ‌ట్టే క‌నిపించిందా.. మెట్రో పిల్ల‌ర్లు క‌నిపించ‌లేదా?.. ఇస్కాన్ స‌మీపంలో త‌వ్వ‌కాల‌పై ఎన్‌హెచ్ఆర్సీకి న్యాయ‌వాది రామారావు ఫిర్యాదు
Advertisement

Metro Pillar | త్రినేత్ర‌.న్యూస్‌: సికింద్రాబాద్‌లోని ఇస్కాన్ ఆలయ (ISKCON Temple) సమీపంలో మెట్రో పిల్లర్ల (C1192, C1193) కింద జరిగిన అక్రమ తవ్వకాల వ్యవహారం క‌ల‌క‌లం సృష్టిస్తున్న‌ది. ప్రమాదకరమైన రీతిలో పిల్లర్ల (Metro Pillar) పునాదుల వద్ద మట్టిని తోడేసిన ఘటనపై మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మనేని (Ramarao Immaneni) జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు (NHRC) ఫిర్యాదు చేశారు. `మెట్రో పిల్ల‌ర్లు క‌నిపించ‌లేదా, మ‌ట్టే క‌నిపించిందా?, పిల్ల‌ర్ల‌కు 4.5 మీట‌ర్ల దూరంలో ఎలాంటి త‌వ్వ‌కాలు జ‌ర‌ప‌కూడ‌ద‌ని నిబంధ‌న‌లు ఉన్న‌ప్ప‌టికీ.. రూల్స్‌కే త‌వ్వ‌కాలా?, పార్కింగ్ కోసం భూమి ఇచ్చారా? మెట్రో పిల్లర్ల పునాదులే తవ్వమన్నారా? అంటూ మండిప‌డ్డారు. మెట్రో పిల్లర్లను తవ్వి, అభివృద్ధి పేరుతో ప్రమాదానికి పునాది?, ఒక పిల్లర్‌కు పియర్ క్యాప్ దెబ్బ, మరో పిల్లర్‌కూ చిసెల్ పని, మెట్రో కూలితే బాధ్యత ఎవరిది?` అంటూ ప్ర‌శ్నించారు.

మెట్రో పిల్లర్ల రక్షణను గాలికొదిలేసి, ఇంత పెద్ద ఎత్తున అక్రమంగా గుంతలు తవ్వుతుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని తప్పుపట్టారు. మీడియా ఛానళ్లలో కథనాలు రావడంతో అప్రమత్తమైన అధికారులు, హడావుడిగా ఆ గుంతలను మట్టితో పూడ్చివేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. `అక్కడ పూడిపోయింది కేవలం మట్టి మాత్రమే కాదు.. అధికారుల బాధ్యతారాహిత్యం, నిజాలు` అంటూ ధ్వజమెత్తారు. మెట్రో పిల్లర్ దెబ్బతింటే ప్రమాదం, అధికారులు మాత్రం ‘మౌన మోడ్’లోనా? అంటూ హెచ్ఎంఆర్ఎల్ (HMRL) తీరుపై మండిప‌డ్డారు.

ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణించే మెట్రో మార్గంలో పిల్లర్ల నిర్మాణ సమగ్రతను దెబ్బతీసేలా తవ్వకాలు జరపడం ప్రజల ప్రాణాలతో ఆడుకోవడమేనని, దీనికి కారణమైన ప్రైవేట్ వ్యక్తులతో పాటు చూసీచూడనట్లు వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్‌హెచ్ఆర్సీని కోరారు.

హెచ్ఎంఆర్ఎల్ ఫిర్యాదు..

అక్రమ తవ్వకాలపై హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతానికి పిల్లర్ల నిర్మాణ స్థిరత్వానికి ఎలాంటి ఢోకా లేదని సాంకేతిక నివేదికలు చెబుతున్నప్పటికీ, నిబంధనలు ఉల్లంఘించి భద్రతకు ముప్పు తెచ్చిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మెట్రో అధికారులు కోరారు.

Advertisement
Advertisement