Land Value | ఈ నెల 28 నుంచి పెరగనున్న భూముల మార్కెట్ విలువ..
Land Value | రాష్ట్రంలో భూముల విలువ (Land Value) పెరుగనుంది. ఈ నెల 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూములు, అపార్టుమెంట్లు, వాణిజ్య స్థలాల ప్రభుత్వ మార్కెట్ విలువను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సవరణ చేయనుంది.
Land Value | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో భూముల విలువ (Land Value) పెరుగనుంది. ఈ నెల 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూములు, అపార్టుమెంట్లు, వాణిజ్య స్థలాల ప్రభుత్వ మార్కెట్ విలువను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సవరణ చేయనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల విలువను సవరించడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో చివరిసారిగా 2022లో భూముల మార్కెట్ విలువ పెరిగింది.
ప్రభుత్వానికి ఆదాయం.. ప్రజలకు భారం
వ్యవసాయ భూముల మార్కెట్ విలువ గరిష్టంగా రెండు నుంచి మూడు రెట్లు పెరగనున్నట్లు సమాచారం. అంటే ప్రస్తుతం ఎకరాకు రూ.6 లక్షలుగా ఉన్న విలువ రూ.12 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగర శివార్లలోని కోర్ అర్బన్ ప్రాంతాల్లో మార్కెట్ విలువ బహిరంగ మార్కెట్ రేట్ల కంటే చాలా తక్కువగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఎకరా విలువ ప్రభుత్వ లెక్కల్లో రూ.20 లక్షలు ఉంటే.. బయట రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లు పలుకుతున్నది. ఇలాంటి చోట్ల మార్కెట్ విలువను ఏకంగా 300 శాతానికి పైగా పెంచి అసమానతలను తగ్గించాలని సర్కార్ భావిస్తున్నది. అయితే రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుండగా, ఆస్తుల కొనుగోలుదారులపై భారం పడనుంది.

విడతల వారీగా..!
ఈ నేపథ్యంలో ఒకేసారి కాకుండా విడతల వారీగా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. మార్కెట్ విలువ ఒకేసారి పెంచినా, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలను మూడు విడతల్లో పెంచనున్నట్టు సమాచారం. దీంతో ఆదాయం సమకూరడంతో పాటు ప్రజలపై ఒకేసారి భారం పడకుండా ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నది. గత ఆర్థిక సంవత్సరం ముగియక ముందే భూముల విలువలు పెరుగుతాయని అంతా భావించారు.
తెలంగాణలో ఈ నెల 28 నుంచి వ్యవసాయ భూములు, అపార్ట్మెంట్లు, వాణిజ్య స్థలాల ప్రభుత్వ మార్కెట్ విలువను స్టాంపులు & రిజిస్ట్రేషన్ల శాఖ సవరణ చేయనుంది. pic.twitter.com/q8d2uoHN2P
— TG Govt Updates (@TGGovtUpdates) May 19, 2026
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



