KTR | మార్కెట్ యార్డులను సందర్శించిన కేటీఆర్.. గోడు వెల్లబోసుకున్న రైతులు
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం సాయంత్రం నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డులోని పరిస్థితులను ఆయన పరిశీలించారు.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం సాయంత్రం నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డులోని పరిస్థితులను ఆయన పరిశీలించారు. రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న సమస్యలను కేటీఆర్‌కు వివరించారు. ధాన్యం కొనుగోళ్లు, మార్కెట్ సదుపాయాలు, చెల్లింపుల ఆలస్యం వంటి అంశాలపై తమ ఇబ్బందులను రైతులు వివరించారు. అలాగే, పరకాల పరకాల నియోజకవర్గం, గీసుగొండ ఊకల్ సొసైటీలోని మక్కల కొనుగోలు కేంద్రంలో రైతులు కేటీఆర్‌కు సమస్యను విన్న వించారు.
కష్టపడి పండించిన పంటను కొనాలని మార్క్‌ఫెడ్ అధికారులకు, కలెక్టర్‌కు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని రైతులు ఈ సందర్భంగా పోయారు. మక్కల కొనుగోళ్లలో జరుగుతున్న నిర్లక్ష్యంపై మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాస్ రెడ్డికి కేటీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. జాప్యంపై నిలదీశారు. మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడి పంట కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని, మార్క్‌ఫెడ్ వైఫల్యాన్ని నిలదశారు. కేటీఆర్ రైతన్నలు పండించిన పంట కొనేది ఉందా లేదా అంటూ ప్రశ్నించారు. కేటీఆర్ వెంట బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్టు చేశాం : సీఎం రేవంత్ రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



