KTR | వడ్ల కొనుగోలుపై కేటీఆర్ అసంతృప్తి.. రోడ్లపై వచ్చి ఆందోళన చేస్తామని వార్నింగ్..!
KTR | సిరిసిల్లలో వడ్ల కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయని కేటీఆర్ ఆరోపించారు. రైతులకు న్యాయం చేయకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
KTR | సిరిసిల్ల నియోజకవర్గంలో వడ్ల కొనుగోలు కేంద్రాల పరిస్థితిపై బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రాలను సందర్శించిన ఆయన, ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గత నెల రోజులుగా రైతులు వడ్లు కొనుగోలు కేంద్రాలకు తెస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క గింజ కూడా కొనలేదని కేటీఆర్ ఆరోపించారు. మద్దతు ధరతో పాటు బోనస్ ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కొనుగోళ్లు చేపట్టడం లేదని విమర్శించారు. రైస్ మిల్లుల కేటాయింపు లేకపోవడంతో కొనుగోలు ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయిందని ఆయన పేర్కొన్నారు.
మిల్లులు కేటాయించకపోతే వడ్లు ఎవరు కొనాలి? ఎలా తూకం వేయాలి..? అని ప్రశ్నించారు. ఈ పరిస్థితిని దళారులకు వదిలేసి కమిషన్ల కోసం ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. రైతుబంధు పథకం పేరుతో ప్రకటించిన సాయం కూడా అందడం లేదని కేటీఆర్ అన్నారు. స్థానిక అధికారులను అడిగితే ఇప్పటివరకు 1000 క్వింటాళ్ల వడ్లు కూడా కొనలేదని చెప్పడం పరిస్థితి తీవ్రతను చూపుతోందని వ్యాఖ్యానించారు.
ఇటీవల కురిసిన అకాల వర్షాలతో రైతులు తెచ్చిన ధాన్యం తడిసిపోతూ నష్టపోతున్నారని, టార్పాలిన్ కవర్లు కొనుగోలు చేసి కప్పుకోవాల్సిన దుస్థితి నెలకొందని చెప్పారు. ఇలాంటి దౌర్భాగ్యకర పరిస్థితులు ఎక్కడా చూడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రైతుల వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేసిన కేటీఆర్, లేనిపక్షంలో రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మరో రెండేళ్లలో తిరిగి తమ ప్రభుత్వం వస్తుందని, అప్పటివరకు రైతులకు అండగా నిలుస్తామని తెలిపారు.
సంబంధిత వార్తలు

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్‌ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



