త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | అస్థిత్వం కోసం ఆరాటం.. అణిచివేత పై పోరాటం.. నాని ‘ది ప్యారడైజ్‌’పై కేటీఆర్‌ రివ్యూ..

KTR | శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో నాని (Nani) హీరోగా రూపొందిన పీరియాడిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ది ప్యారడైజ్‌’ (The Paradise) సినిమాను బీఆర్‌ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (KTR) తిల‌కించారు.

G

Telangana | Published On Sep 27, 2026, 6.54 am IST

KTR | అస్థిత్వం కోసం ఆరాటం.. అణిచివేత పై పోరాటం.. నాని ‘ది ప్యారడైజ్‌’పై కేటీఆర్‌ రివ్యూ..
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్‌: శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో నాని (Nani) హీరోగా రూపొందిన పీరియాడిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ది ప్యారడైజ్‌’ (The Paradise) సినిమాను బీఆర్‌ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (KTR) తిల‌కించారు. శనివారం రాత్రి హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్‌లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డితో కలిసి మూవీని చూశారు. సినిమా అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఒక సమాజంపై అణిచివేత జరిగినప్పుడు ఒక నాయకుడు వచ్చి పోరాటం చేసి గుర్తింపు తెచ్చిన కథకి చక్కటి దృశ్య రూపం ఇచ్చారని తెలిపారు. తెలంగాణ, యాస, భాషతో సినిమాను తీర్చిదిద్దిన విధానం బాగుందని చెప్పారు.

‘అస్థిత్వం కోసం ఆరాటం, అణిచివేత పై పోరాటం. సందర్భం వస్తే గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి అనే సందేశాన్ని అందించిన తమ్ముడు శ్రీకాంత్ ఓదెల కి హృదయపూర్వక అభినందనలు.

కథానాయకుడి పాత్రలో జీవించిన మిత్రుడు నానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. తమ్ముడు ప్రియదర్శికి ప్రత్యేక అభినందనలు.
`‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా!!’’

You know who that is ✊` అంటూ ఎక్స్ వేదిక‌గా కేటీఆర్ పోస్ట్‌ చేశారు.

ప్యారడైజ్ సినిమాలో కేసీఆర్‌ను పోలిన ఎమ్మెల్యే శంకరన్న పాత్రను నటుడు ప్రియదర్శి పోషించిన విషయం తెలిసిందే. ఆ క్యారెక్ట‌ర్‌కు సంబంధించిన సన్నివేశాలు తెరపై కనిపించగానే అరుపులు, కేకలతో థియేటర్‌ ఊగిపోయింది. తెరపై ఆ సన్నివేశాలు వస్తున్నప్పుడు కేటీఆర్‌ చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. కాగా బీఆర్ఎస్ అభిమానులు థియేట‌ర్‌లో హంగామా చేశారు. ‘ఆయా షేర్’ అంటూ కేసీఆర్, కేటీఆర్ ఫ్లెక్సీలను ప్రదర్శించారు. గాల్లోకి పేపర్లు విసిరుతూ ఎంజాయ్‌చేశారు.

Advertisement
Advertisement