KTR | ఉద్యమ బిడ్డ కుటుంబానికి కేటీఆర్ అండ.. 9 లక్షల ఆర్థిక సాయం
KTR | ఇటీవల అనారోగ్యంతో మరణించిన తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్దన్ కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు.
త్రినేత్ర న్యూస్: ఇటీవల అనారోగ్యంతో మరణించిన తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్దన్ కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. జనార్దన్ ముగ్గురు కుమార్తెలు ఒక్కొక్కరి పేరు మీద రూ.3 లక్షల చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయించారు. తక్షణ ఆర్థిక సాయంగా శనివారం రూ.లక్ష అందించారు. జనార్ధన్ కుటుంబం దీన స్థితిని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఈమేరకు ఆయన స్పందించి ఆర్థిక సాయం చేశారు.
దళిత కుటుంబానికి చెందిన ఈదురు జనార్ధన్ తెలంగాణ ఉద్యమంలో మానుకోట సంఘటన నుంచి మొదలుకొని చురుకైన పాత్ర పోషించాడు. పేదరికంతో ఇబ్బందులు పడుతూ, కుటుంబ పోషణ కోసం రోజువారీ కూలీగా పనిచేస్తున్న ఆయన కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఆయనకు ముగ్గురు ఆడబిడ్డలు ఉండడంతో ఈ విషయాన్ని కేటీఆర్‌కు తెలియజేశారు. దీంతో ఆ ఆడబిడ్డల భవిష్యత్తుకు భరోసాగా ఆర్థిక సాయం అందజేశారు.
కేటీఆర్ ఆదేశాల మేరకు పరామర్శ
కేటీఆర్ ఆదేశాల మేరకు సీనియర్ నేతలు సత్యవతి రాథోడ్, రెడ్డ్యా నాయక్, మలోత్ కవిత, మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇతర బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ఈదురు జనార్ధన్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, కేటీఆర్ అందించిన ఆర్థిక సహాయాన్ని వారికి అందజేశారు. తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు అండగా నిలవాలనే బాధ్యతతో కేటీఆర్ చొరవకు వారు ధన్యవాదాలు తెలిపారు.
తాజావార్తలు
- ●Dasara Special | శ్రీశైలానికి దసరా శోభ.. రేపటి నుంచి నవదుర్గలుగా భ్రమరాంబిక దర్శనం!
- ●GST | జీఎస్టీలో కీలక సంస్కరణలు.. రిజిస్ట్రేషన్ నుంచి రిఫండ్ వరకు సులువు..
- ●MDMA Drugs | రంగారెడ్డి జిల్లాలో పట్టుబడ్డ డ్రగ్స్
- ●6G Network | భారత్లో 6జీ నెట్వర్క్ విస్తరణ కష్టమే..
- ●Shruti Haasan | రెమ్యూనరేషన్ లేకుండా ఫ్రీగా సినిమా - శోభిత ధూళిపాళ తమిళ మూవీలో శృతి హాసన్ గెస్ట్ రోల్!
- ●KTR | గజ్వేల్ ఎమ్మార్వోపై చర్యలు తీసుకోండి : కేటీఆర్

Dasara Special | శ్రీశైలానికి దసరా శోభ.. రేపటి నుంచి నవదుర్గలుగా భ్రమరాంబిక దర్శనం!

GST | జీఎస్టీలో కీలక సంస్కరణలు.. రిజిస్ట్రేషన్ నుంచి రిఫండ్ వరకు సులువు..

MDMA Drugs | రంగారెడ్డి జిల్లాలో పట్టుబడ్డ డ్రగ్స్

6G Network | భారత్లో 6జీ నెట్వర్క్ విస్తరణ కష్టమే..





