త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

6G Network | భార‌త్‌లో 6జీ నెట్‌వ‌ర్క్ విస్త‌ర‌ణ క‌ష్ట‌మే..

6G Network | భారత్‌లో 6జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి వ‌చ్చేందుకు మ‌రింత స‌మ‌యం ప‌ట్ట‌నున్న‌ది. 2030 వరకు సమయం పట్టే అవ‌కాశం ఉన్న‌ది. ఆ స‌మ‌యానికి దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో విస్తరించడం కష్టమేనని సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీవోఏఐ) డైరెక్టర్‌ జనరల్‌ ఎస్పీ కొచ్చర్‌ తెలిపారు.

P

Business | Published On Oct 10, 2026, 4.56 pm IST

6G Network | భార‌త్‌లో 6జీ నెట్‌వ‌ర్క్ విస్త‌ర‌ణ క‌ష్ట‌మే..
Advertisement
  • 2030 వ‌ర‌కు స‌మ‌యం అవ‌కాశం
  • సీవోఏఐ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఎస్పీ కొచ్చ‌ర్‌

6G Network | భారత్‌లో 6జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి వ‌చ్చేందుకు మ‌రింత స‌మ‌యం ప‌ట్ట‌నున్న‌ది. 2030 వరకు సమయం పట్టే అవ‌కాశం ఉన్న‌ది. ఆ స‌మ‌యానికి దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో విస్తరించడం కష్టమేనని సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీవోఏఐ) డైరెక్టర్‌ జనరల్‌ ఎస్పీ కొచ్చర్‌ తెలిపారు. ఇప్పటికే 5జీపై భారీగా పెట్టుబడులు పెట్టిన టెలికాం సంస్థలకు ఆశించిన స్థాయిలో ఆదాయం రావడం లేదని, దీంతో 6జీ పెట్టుబడులపై సందేహాలు నెలకొన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం 5జీ నెట్‌వర్క్‌ల ద్వారా అదనపు ఆదాయం తెచ్చిపెట్టే ప్రత్యేక అప్లికేషన్లు అందుబాటులో లేకపోవడం ప్రధాన సమస్యగా మారిందని కొచ్చర్‌ వివరించారు. 6జీ కోసం భారీగా ఖర్చు చేయాలంటే.. ఆ పెట్టుబడులకు తగిన ఆదాయం వచ్చే మార్గాలు స్పష్టంగా క‌నిపించాల‌న్నారు. ఈ నేపథ్యంలో 2030 నాటికి 6జీ సేవలు ప్రారంభమైనా.. విస్తరణకు మ‌రింత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌న్నారు.

రాయితీలు ఇవ్వాల‌ని సూచ‌న‌..

టెలికాం సంస్థల ఆదాయానికి, నిర్వహణ వ్య‌వ‌యానికి మ‌ధ్‌య అంతరం పెరుగుతోందని కొచ్చర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. నెట్‌వర్క్‌ పరికరాలు, స్పెక్ట్రమ్‌, నిర్వహణ ఖర్చులు పెరుగుతుండటంతో లాభాలు తగ్గుతున్నాయని పేర్కొన్నారు. లెవీలు, నియంత్రణ రుసుములు, స్పెక్ట్రమ్‌ ధరల విషయంలో ప్రభుత్వం ఉపశమనం కల్పించాలని కోరారు. ఖర్చుల భారం ఇలాగే కొనసాగితే మొబైల్‌ టారిఫ్‌ల పెంపు చివరి ప్రత్యామ్నాయంగా మారవచ్చని సంకేతాలిచ్చారు. ఇదిలా ఉండ‌గా.. 2023 మార్చిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘ఇండియా 6జీ విజన్‌’లో భాగంగా 2030 నాటికి 6జీ సాంకేతికత రూపకల్పన, అభివృద్ధి, అమలులో భారత్‌ను కీలక దేశంగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ 6జీ పేటెంట్లు, ప్రమాణాల్లో 10 శాతం వాటా సాధించాలని నిర్దేశించింది. దేశీయ పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించడంతోపాటు అంతర్జాతీయ ప్రమాణాల రూపకల్పనలోనూ భారత్‌ భాగస్వామ్యం పెంచుకుంటోంది.

ఏఐతో మోసాలకు చెక్‌..

భారత్‌లో ప్రపంచంలోనే వేగంగా 5జీ విస్తరణ జరిగిందని, టెలికాం రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం పెరుగుతోందని కొచ్చర్‌ తెలిపారు. నెట్‌వర్క్‌ పనితీరు మెరుగుపరచడంతోపాటు స్కామ్‌లు, డిజిటల్‌ మోసాలను అరికట్టేందుకు ఏఐ ఆధారిత సాంకేతికతను వినియోగిస్తున్నట్లు వివరించారు. 6జీ అంతర్జాతీయ ప్రమాణాల రూపకల్పనలో మీడియాటెక్‌ కూడా భాగస్వామిగా ఉందని ఆ సంస్థ సీనియర్‌ డైరెక్టర్‌ అక్షయ్‌ అగర్వాల్‌ తెలిపారు. 3జీపీపీ వంటి అంతర్జాతీయ సంస్థలు 6జీ ప్రమాణాల అభివృద్ధిపై పనిచేస్తున్నాయని చెప్పారు. టెలికాం పరిశ్రమ, పరిశోధనా సంస్థలు, విద్యాసంస్థలతో కలిసి ఈ సాంకేతికతపై పరిశోధనలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

Advertisement
Advertisement