త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | అలంపూర్ ఎమ్మెల్యేపై చేయిచేసుకున్న మ‌ల్లు ర‌వి.. కాంగ్రెస్ నేతల‌ దిగజారిన రాజకీయానికి నిదర్శనం: కేటీఆర్‌

KTR | అలంపూర్ ఎమ్మెల్యే విజ‌యుడిపై కాంగ్రెస్ ఎంపీ మ‌ల్లు ర‌వి చేయిచేసుకోవ‌డాన్ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రంగా ఖండించారు. దీనిని ప్ర‌జాస్వామ్యంపై జ‌రిగిన దాడిగా పేర్కొన్నారు.

G

Telangana | Published On Jan 21, 2026, 10.55 am IST

KTR | అలంపూర్ ఎమ్మెల్యేపై చేయిచేసుకున్న మ‌ల్లు ర‌వి.. కాంగ్రెస్ నేతల‌ దిగజారిన రాజకీయానికి నిదర్శనం: కేటీఆర్‌
Advertisement

త్రినేత్ర.న్యూస్‌: అలంపూర్ ఎమ్మెల్యే విజ‌యుడిపై కాంగ్రెస్ ఎంపీ మ‌ల్లు ర‌వి చేయిచేసుకోవ‌డాన్ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రంగా ఖండించారు. దీనిని ప్ర‌జాస్వామ్యంపై జ‌రిగిన దాడిగా పేర్కొన్నారు. ప్రతిపక్షాన్ని భయపెట్టేందుకు, గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ నేతల‌ దిగజారిన రాజకీయానికి ఇది నిదర్శనమ‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఎంపీ మ‌ల్లుర‌వి త‌క్ష‌ణ‌మే క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌తిప‌క్షాన్ని బెదిరింపులతో కాదు, ప్రజల తీర్పుతోనే ఎదుర్కోవాలంటూ ఎక్స్ వేదిగా పేర్కొన్నారు.

`అలంపూర్ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ నాయకుడు విజయుడిపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి దుర్భాషలాడుతూ చేయి చేసుకోవడం ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడి. ప్రతిపక్షాన్ని భయపెట్టేందుకు, గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ నేతలు దిగజారిన రాజకీయానికి ఇది నిదర్శనం. ప్రజలతో ఎన్నికైన ఎమ్మెల్యేను అవమానిస్తూ, శారీరక దాడికి దిగడం కాంగ్రెస్ సంస్కృతి ఎంత దిగజారిందో అర్ధం అవుతుంది.

చట్టం, రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలపై కాంగ్రెస్‌కు గౌరవం లేదని ఈ ఘటన మరోమారు స్పష్టం చేస్తోంది. బీఆర్‌ఎస్ పార్టీ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తోంది. ఎంపీ మల్లు రవి తక్షణమే క్షమాపణ చెప్పాలి.సీఎం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించి చర్యలు తీసుకోవాలి. ప్రతిపక్షాన్ని బెదిరింపులతో కాదు, ప్రజల తీర్పుతోనే ఎదుర్కోవాలి. బీఆర్‌ఎస్ నాయకులపై దాడులు చేస్తే చూస్తూ ఉరుకోము ప్రజాస్వామ్య పద్ధతుల్లో గట్టిగా ఎదుర్కొంటాం..` అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement