OnePlus | ‘వన్ ప్లస్’ దుకాణం బంద్..? కార్యకలాపాలను నిలిపివేస్తున్నారా..?
OnePlus | ఒకప్పుడు ఫ్లాగ్‌షిప్ కిల్లర్ గా పేరు తెచ్చుకున్న వన్‌ప్లస్ (OnePlus) బ్రాండ్ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. ఆండ్రాయిడ్ హెడ్‌లైన్స్ అనే టెక్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం, మాతృ సంస్థ ఒప్పో (Oppo) వన్‌ప్లస్‌ను నెమ్మదిగా డౌన్ సైజ్ చేస్తోందని, కొన్ని మార్కెట్లలో కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోయాయని పేర్కొంది.
Technology | Published On Jan 21, 2026, 12.13 pm IST
OnePlus | ఒకప్పుడు ఫ్లాగ్‌షిప్ కిల్లర్ గా పేరు తెచ్చుకున్న వన్‌ప్లస్ (OnePlus) బ్రాండ్ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. ఆండ్రాయిడ్ హెడ్‌లైన్స్ అనే టెక్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం, మాతృ సంస్థ ఒప్పో (Oppo) వన్‌ప్లస్‌ను నెమ్మదిగా డౌన్ సైజ్ చేస్తోందని, కొన్ని మార్కెట్లలో కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోయాయని పేర్కొంది. అయితే, ఈ వార్తలను వన్‌ప్లస్ ఇండియా సీఈఓ రాబిన్ లియూ ఖండించారు. భారతదేశంలో మా కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగుతున్నాయి. ఎలాంటి మార్పు లేదు అని ఆయన సోషల్ మీడియాలో స్పష్టం చేశారు. నివేదికలు చెబుతున్న ప్రకారం, 2024లో వన్‌ప్లస్ గ్లోబల్ షిప్‌మెంట్లు 20 శాతం కంటే ఎక్కువగా తగ్గాయి. భారత్‌లో మార్కెట్ షేర్ 3.9 శాతానికి పడిపోయిందని, సుమారు 4,500 రిటైల్ స్టోర్లు మూతపడ్డాయని పేర్కొంది. ఇక చైనాలో కూడా వన్ ప్లస్ మార్కెట్ వాటా 2 నుంచి 1.6 శాతానికి తగ్గింది.
ప్రస్తుత యూజర్లకు అప్‌డేట్స్ కొనసాగింపు..
అంతేకాకుండా, OnePlus Open 2 ఫోల్డబుల్ ఫోన్, OnePlus 15s కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ వంటి కొన్ని ప్రాజెక్టులు రద్దయ్యాయని కూడా ఆ నివేదిక వెల్లడించింది. ప్రధాన నిర్ణయాలన్నీ ఇప్పుడు చైనాలోనే తీసుకుంటున్నారని, యూరప్, ఉత్తర అమెరికాలో టీమ్‌లను గణనీయంగా తగ్గించారని పేర్కొంది. ప్రస్తుత వన్‌ప్లస్ యూజర్లకు సెక్యూరిటీ అప్‌డేట్స్, వారంటీ సపోర్ట్ కొనసాగుతాయని ఒప్పో హామీ ఇచ్చిందని రిపోర్ట్ చెబుతోంది. కానీ భవిష్యత్తులో కొత్త మోడళ్లకు సపోర్ట్ ఆగిపోతే, అదే వన్‌ప్లస్ బ్రాండ్ ముగింపు కావొచ్చని అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఈ విషయంపై ఒప్పో లేదా వన్‌ప్లస్ నుంచి అధికారికంగా పూర్తి ప్రకటన మాత్రం రాలేదు. కానీ ఈ నివేదిక టెక్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీసింది.
వార్తలు నిజమే..?
కాగా వన్ ప్లస్ సంస్థను 2013లో స్వతంత్ర స్మార్ ఫోన్ బ్రాండ్‌గా ప్రారంభించారు. కానీ ఆ తరువాత అప్పట్లో బీబీకే ఎలక్ట్రానిక్స్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఒప్పోతో భాగస్వామ్యం అయింది. అయితే 2021 నుంచి నేరుగా ఒప్పోతోనే వన్ ప్లస్ సంస్థ కలిసి వ్యాపార లావాదేవీలను నిర్వహిస్తోంది. అలాగే ఇరు సంస్థలు సంయుక్తంగా స్మార్ట్ ఫోన్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నాయి. పరిశోధన, అభివృద్ధి, ఉత్పత్తి విభాగాల్లో ఇరు సంస్థలు కలిసి కార్యకలాపాలను నిర్వహిస్తూ వస్తున్నాయి. అయితే వన్ ప్లస్ అమ్మకాలు తగ్గిపోవడంతోపాటు మార్కెట్ షేర్ గణనీయంగా పడిపోవడం, యూజర్లు ఆ బ్రాండ్‌పై పెద్దగా ఆసక్తిని చూపించకపోవడం, ప్రత్యర్థి కంపెనీలు ఇస్తున్న గట్టి పోటీ నుంచి తట్టుకోలేక వన్ ప్లస్ ఈ రంగంలో చాలా వరకు వెనుకబడింది. అయితే తాజాగా వచ్చిన వార్తల నేపథ్యంలో వన్‌ప్లస్ ఇండియా సీఈఓ రాబిన్ లియూ స్పందించి ఎక్స్ లో వివరణ ఇస్తూ పోస్టు పెట్టారు. కానీ ఆ వార్తల్లో చాలా వరకు నిజం ఉందని భావిస్తున్నారు.
I wanted to address some misinformation that has been circulating about OnePlus India and its operations.
We’re operating as usual and will continue to do so.
Never Settle. pic.twitter.com/eAGA7iy3Xs— Robin Liu (@RobinLiuOnePlus) January 21, 2026
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్ఫుల్ ఫ్లాగ్‌షిప్..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

OPPO India | కంటెంట్ క్రియేటర్లు, షార్ట్ ఫిలిం మేకర్స్‌కు ఒప్పో కొత్త ప్రోగ్రామ్.. రూ.5 లక్షలు గెలుచుకునే చాన్స్..
మే 11, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



