త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nidhhi Agerwal | పబ్లిక్‌ ఫిగర్స్‌.. పబ్లిక్‌ ప్రాపర్టీ కాదు.. నిధి అగర్వాల్‌ సంచలన కామెంట్స్‌..!

Nidhhi Agerwal | నిధి అగర్వాల్‌ ఇటీవల ప్రభాస్‌ సరసన ‘ది రాజా సాబ్‌’తో ప్రేక్షకుల ముందుకువచ్చింది. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ హారర్‌ కామెడీ మూవీకి మిక్స్‌డ్‌ రివ్యూలు వచ్చాయి. బాక్సాఫీస్‌ వద్ద మూవీ ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది.

P

Entertainment | Published On Jan 21, 2026, 12.10 pm IST

Nidhhi Agerwal | పబ్లిక్‌ ఫిగర్స్‌.. పబ్లిక్‌ ప్రాపర్టీ కాదు.. నిధి అగర్వాల్‌ సంచలన కామెంట్స్‌..!
Advertisement

Nidhhi Agerwal | నిధి అగర్వాల్‌ ఇటీవల ప్రభాస్‌ సరసన ‘ది రాజా సాబ్‌’తో ప్రేక్షకుల ముందుకువచ్చింది. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ హారర్‌ కామెడీ మూవీకి మిక్స్‌డ్‌ రివ్యూలు వచ్చాయి. బాక్సాఫీస్‌ వద్ద మూవీ ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. తాజాగా నిధి అగర్వాల్‌ ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొంది. పీఆర్‌ కల్చర్‌, పెయిడ్‌ నెగెటివ్‌ పీఆర్‌పై తన అభిప్రాయాలను వెల్లడించింది. ఇండస్ట్రీలో డబ్బు ఎక్కువగా టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు కాకుండా ఇతరులను కించపరిచేందుకు వాడుతున్నారని వ్యాఖ్యానించింది. తాను సైతం నెగెటివ్‌ పీఆర్‌ను ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపింది.

చాలా రకాలుగా నెగెటివ్‌ పీఆర్‌ జరుగుతోంది. బుక్‌ మై షో, ఐఎండీబీ రేటింగ్స్‌పై ప్రభావం ఉందని.. పెయిడ్‌ రివ్యూస్‌ అనే ప్రత్యేక విభాగమే ఉంది. కొందరు తాము ఎదిగేందుకు కాకుండా.. ఇతరులను కిందకు లాగేందుకు డబ్బును ఖర్చు చేస్తున్నారని ఆరోపించింది. ఇటీవల తనపై రెండు నెగెటివ్‌ క్యాంపెయిన్స్‌ మొదలయ్యాయని.. తనను తాను పాజిటివ్‌గా ప్రమోట్‌ చేసుకుంటానని.. నెగెటివ్‌గా ప్రమోట్‌ చేస్తే తిరిగి అదే రీతిలో స్పందిస్తానని తెలిపింది. ఇటీవల వరుణ్‌ ధావన్‌, కార్తీక్‌ ఆర్యన్‌లపై జరిగిన నెగెటివ్‌ పీఆర్‌ దాడులపై నిధి స్పందించింది. ఇది చాలా తప్పని.. దీనికి డబ్బు ఖర్చు చేస్తున్నారని వాపోయింది.

నటీనటులు చాలా సెన్సిటివ్‌గా, ఎమోషనల్‌గా ఉంటారని.. లోలోపల వారు పిల్లలంటి వారేనని.. నెగెటివ్‌ పీఆర్‌ మానసిక ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుందని పేర్కొంది. పబ్లిక్‌ ఫిగర్స్‌ పబ్లిక్‌ ప్రాపర్టీ కాదని.. అందరికీ ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారని, ఇది సరైన పద్ధతి కాదని పేర్కొంది. తాను కాశీకి వెళ్లి వచ్చానని.. ఆ తర్వాత తన జీవితంలో మార్పులు వచ్చాయని తెలిపింది. ప్రస్తుతం నిధి అగర్వాల్‌ కామెంట్స్‌ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. ఇదిలా ఉండగా.. నిధి అగర్వాల్‌ సినిమాల విషయానికి వస్తే.. చివరగా ‘ది రాజా సాబ్‌’ మూవీలో నటించింది. ప్రభాస్‌, సంజయ్‌ దత్‌, మాళవిక మోహనన్‌, రిద్ది కుమార్‌, జరీనా వహాబ్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద నిరాశ పరిచింది.

Advertisement

తాజావార్తలు

Advertisement