Revanth Reddy | ప్రతి జూలైలో హైదరాబాద్ వేదికగా డబ్ల్యూఈఎఫ్ ఫాలో అప్ సదస్సు: సీఎం రేవంత్
Revanth Reddy | స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఏడాది జూలైలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) ఫాలో-అప్ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించాలని ప్రతిపాదించారు.
త్రినేత్ర.న్యూస్: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఏడాది జూలైలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) ఫాలో-అప్ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించాలని ప్రతిపాదించారు. ‘జాయిన్ ది రైజ్’ కార్యక్రమంలో ఈ ప్రతిపాదనకు గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పాలసీ నిర్ణేతలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు.
ఈ రోజుల్లో పెట్టుబడుల ఒప్పందాలు, వ్యాపార వాణిజ్య నిర్ణయాలకు ఒక సంవత్సరం చాలా ఎక్కువ సమయమని సీఎం రేవంత్ అన్నారు. అందుకే ప్రతి ఏడాది జూలై లేదా ఆగస్టులో హైదరాబాద్‌లో ఫాలో-అప్ సదస్సు నిర్వహించాలని డబ్ల్యూఈఎఫ్ ప్రతినిధులకు సూచించారు. హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైందని, రూ.5.75 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు ఆకర్షించిందని తెలిపారు.

ప్రతి ఏడాది తాము ఎంవోయూలపై సంతకాలు చేయడానికి దావోస్‌కు వస్తాం. కానీ ఈసారి గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావడంతో, తెలంగాణ రైజింగ్ విజన్, ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలను ప్రపంచానికి చూపించడానికి వచ్చామన్నారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు (GCCs) హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారిందని చెప్పారు. మూసీ నది పునరుజ్జీవనంతోపాటు రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేసి నైట్ టైమ్ ఎకానమీపై దృష్టి పెడుతామని తెలిపారు. దేశంలోనే 24 గంటలు పనిచేసే తొలి నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని ప్రకటించారు. ఇందులో 50 శాతం కంటే ఎక్కువ గ్రీన్ కవర్ ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యమెంట్ లక్ష్యాలను ప్రదర్శించారు. అదేవిధంగా తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ (TAIH), తెలంగాణ నెక్స్ట్ -జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–2030ని ఆవిష్కరించారు.
ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి

డబ్ల్యూఈఎఫ్ సదస్సులో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి చిరంజీవి ఈ సమావేశం పాల్గొన్నారు. మెగాస్థార్.. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్‌లో ఉన్నారని తెలుసుకున్న సీఎం.. సదస్సుకు రావాలని ఆహ్వానించారు. దీంతో ఆయన హాజరయ్యారు. సదస్సు వేదికపై ఆవిష్కరించిన తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌ను చిరంజీవి వీక్షించారు. ఈ సందర్భంగా తమ కుటుంబసభ్యులతో కలిసి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా వీక్షించానని.. ఎంతో ఆస్వాదించానని చిరుతో సీఎం రేవంత్ చెప్పారు.

ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
మే 21, 2026

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



