Samsung Galaxy Tab S10 Plus | గెలాక్సీ ట్యాబ్ ఎస్10 ప్లస్‌పై భారీ డిస్కౌంట్.. ధర ఎంతంటే..
Samsung Galaxy Tab S10 Plus | శామ్‌సంగ్ భారత మార్కెట్లో తన ప్రీమియం ట్యాబ్లెట్ గెలాక్సీ ట్యాబ్ ఎస్10 ప్లస్‌పై పండుగ సీజన్ ఆఫర్లను ప్రకటించింది. వైఫై, 5జి రెండు మోడళ్లపై భారీ ధర తగ్గింపుతోపాటు సులభమైన వాయిదా చెల్లింపు సదుపాయాలను అందిస్తోంది. గెలాక్సీ ట్యాబ్ ఎస్10ప్లస్ వైఫై మోడల్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది.
Technology | Published On Sep 9, 2026, 2.35 pm IST
Samsung Galaxy Tab S10 Plus | శామ్‌సంగ్ భారత మార్కెట్లో తన ప్రీమియం ట్యాబ్లెట్ గెలాక్సీ ట్యాబ్ ఎస్10 ప్లస్‌పై పండుగ సీజన్ ఆఫర్లను ప్రకటించింది. వైఫై, 5జి రెండు మోడళ్లపై భారీ ధర తగ్గింపుతోపాటు సులభమైన వాయిదా చెల్లింపు సదుపాయాలను అందిస్తోంది. గెలాక్సీ ట్యాబ్ ఎస్10ప్లస్ వైఫై మోడల్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. దీని అసలు ధర రూ.1,05,999 కాగా, పండుగ ఆఫర్‌లో రూ.88,999కే అందుబాటులో ఉంది. అంటే రూ.17వేల తగ్గింపు లభిస్తోంది. 5జి మోడల్ అసలు ధర రూ.1,20,999 కాగా, ప్రస్తుతం రూ.1,03,999కి విక్రయిస్తున్నారు. ఈ మోడల్‌పై కూడా రూ.17వేలు ధర తగ్గింది. కొనుగోలుదారులకు బ్యాంకుల ద్వారా గరిష్ఠంగా 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ, ఎన్‌బీఎఫ్‌సీల ద్వారా 12 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం ఉంది. వైఫై మోడల్‌కు బ్యాంక్ ఈఎంఐ నెలకు రూ.14,833 నుంచి, ఎన్‌బీఎఫ్‌సీ ద్వారా రూ.7,417 నుంచి ప్రారంభమవుతుంది. శాంమ్‌సంగ్ ఫైనాన్స్ ప్లస్ ద్వారా 15 శాతం ముందస్తు చెల్లింపుతో నెలకు రూ.6,877 నుంచి వాయిదాలు ప్రారంభమవుతాయి.
5జి మోడల్‌పై..
5జి మోడల్‌కు బ్యాంక్ ఈఎంఐ నెలకు రూ.17,333 నుంచి, ఎన్‌బీఎఫ్‌సీ ఈఎంఐ రూ.8,667 నుంచి ప్రారంభమవుతుంది. శామ్‌సంగ్ ఫైనాన్స్ ప్లస్ లో 15 శాతం డౌన్ పేమెంట్‌తో నెలకు రూ.8,036 నుంచి చెల్లించే అవకాశం ఉంది. హార్డ్‌వేర్ విషయానికి వస్తే గెలాక్సీ ట్యాబ్ ఎస్10 ప్లస్ లో 31.47 సెంటీమీటర్ల డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్‌ప్లే ఉంది. యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ ఉండటంతో ఇంటి లోపల, బయట స్క్రీన్‌పై పడే కాంతి ప్రతిబింబాలను తగ్గిస్తుంది. ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్‌తో రూపొందించిన ఈ ట్యాబ్లెట్‌కు ఐపీ68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉంది. క్వాడ్ స్పీకర్ వ్యవస్థతోపాటు మీడియా ప్లేబ్యాక్‌లో స్వరాలను స్పష్టంగా వినిపించేలా చేసే డైలాగ్ బూస్ట్ అనే ఏఐ ఫీచర్ కూడా ఉంది.
ఫీచర్లు ఎలా ఉన్నాయి..
ఈ ట్యాబ్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్లస్ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. దీనికి 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ జత చేశారు. మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను మరింత పెంచుకోవచ్చు. 10,090 ఎంఏహెచ్ బ్యాటరీని అందించి, 45 వాట్ల వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చారు. ఉత్పాదకత కోసం ఎస్ పెన్ స్టైలస్ కూడా బాక్స్‌లోనే లభిస్తుంది. గెలాక్సీ ఏఐ ఫీచర్లలో భాగంగా నోట్ అసిస్ట్ మాట్లాడిన లెక్చర్లు లేదా సమావేశాలను ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌క్రిప్ట్ చేసి, వాటి సారాంశాలను రూపొందిస్తుంది. హ్యాండ్‌రైటింగ్ హెల్ప్ చేతిరాతను మరింత స్పష్టంగా, క్రమబద్ధంగా మార్చడంలో సహాయపడుతుంది. పీడీఎఫ్ ఓవర్‌లే ట్రాన్స్‌లేషన్ ద్వారా డాక్యుమెంట్‌ను స్క్రీన్‌పైనే అనువదించుకోవచ్చు. సర్కిల్ టు సెర్చ్ ఫీచర్‌తో ప్రస్తుతం ఉపయోగిస్తున్న అప్లికేషన్‌ను మూసివేయకుండానే గూగుల్ విజువల్ సెర్చ్, తక్షణ అనువాదాలను పొందవచ్చు. ఎయిర్ కమాండ్ ద్వారా శామ్‌సంగ్ బిక్స్‌బీ, గూగుల్ జెమిని వంటి వాయిస్ అసిస్టెంట్లను కూడా యాక్సెస్ చేయవచ్చు.
స్మార్ట్ థింగ్స్ ప్లాట్‌ఫామ్..
స్మార్ట్‌థింగ్స్ ప్లాట్‌ఫామ్‌తో గెలాక్సీ ట్యాబ్ ఎస్10 ప్లస్ ను ఇంటి స్మార్ట్ పరికరాలను నియంత్రించే కేంద్ర డిస్‌ప్లేగా కూడా ఉపయోగించుకోవచ్చు. 3డి మ్యాప్ వ్యూ ద్వారా ఇంట్లోని కనెక్టెడ్ పరికరాలను లేఅవుట్‌లో చూడొచ్చు. స్మార్ట్‌థింగ్స్ ఎనర్జీ, ఏఐ ఎనర్జీ మోడ్ వంటి ఫీచర్ల ద్వారా అనుకూలమైన గృహోపకరణాల విద్యుత్ వినియోగాన్ని పర్యవేక్షించడంతోపాటు వినియోగ వివరాలను తెలుసుకోవచ్చు.
తాజావార్తలు
- ●Uber | ఉబర్ సంచలన నిర్ణయం.. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి
- ●Ekta Ratod | టాలీవుడ్లోకి కన్నడ సోయగం ఏక్తా రాథోడ్.. తొలి సినిమాతో హిట్ కొట్టేనా..?
- ●స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2026: జాతీయ స్థాయిలో హైదరాబాద్ ర్యాంకెంత?.. నగరవాసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
- ●Kayadu Lohar | ‘ఆ ప్రశ్న’ అడిగినప్పుడే.. సమాజం అసలు రూపం బయటపడుతుంది..! కయదు లోహర్ ఆసక్తికర పోస్ట్..!
- ●Irumudi | ఓటీటీలోకి ‘ఇరుముడి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడో తెలుసా?
- ●Vijay Mallya | బ్రిటన్ నుంచి బయటకు రాలేను.. మాల్యా సంచలన వ్యాఖ్యలు..

Uber | ఉబర్ సంచలన నిర్ణయం.. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి

Ekta Ratod | టాలీవుడ్లోకి కన్నడ సోయగం ఏక్తా రాథోడ్.. తొలి సినిమాతో హిట్ కొట్టేనా..?

స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2026: జాతీయ స్థాయిలో హైదరాబాద్ ర్యాంకెంత?.. నగరవాసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

Kayadu Lohar | ‘ఆ ప్రశ్న’ అడిగినప్పుడే.. సమాజం అసలు రూపం బయటపడుతుంది..! కయదు లోహర్ ఆసక్తికర పోస్ట్..!



