త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Konda Murali | మీసం మెలేసిన కొండా ముర‌ళీ.. దేనికి సంకేతం..?

Konda Murali | కొండా సురేఖ‌ను సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డం రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చానీయాంశమైంది. ప‌లువురు బీసీ నేత‌లు ఈ చ‌ర్య‌ను తీవ్రంగా ఖండించ‌గా.. సురేఖ భ‌ర్త కొండా ముర‌ళీ ప్ర‌వ‌ర్త‌న సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

S

Telangana | Published On Sep 3, 2026, 5.49 pm IST

Konda Murali | మీసం మెలేసిన కొండా ముర‌ళీ.. దేనికి సంకేతం..?
Advertisement

Konda Murali | కొండా సురేఖ‌ను సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డం రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చానీయాంశమైంది. ప‌లువురు బీసీ నేత‌లు ఈ చ‌ర్య‌ను తీవ్రంగా ఖండించ‌గా.. సురేఖ భ‌ర్త కొండా ముర‌ళీ ప్ర‌వ‌ర్త‌న సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. హైద‌రాబాద్‌లోని త‌న నివాసం మొద‌టి అంత‌స్తు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి కొండా ముర‌ళీ మీసం మెలేశారు. అస‌లు త‌గ్గేదేలే అనే సంకేతమిచ్చారు. మేం అంటే అంత చుల‌క‌నా.. ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు అంత బ‌లుపా అన్న రీతిలో ముర‌ళీ వ్య‌వ‌హ‌రించార‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు. సాధార‌ణంగా క‌క్ష‌పూరిత చ‌ర్య‌లు తీసుకున్న‌ప్పుడు ఇలా మీసం మెలేసి మేమేంటో చూపిస్తామ‌ని ఎదుటి వారికి సంకేతాలు ఇస్తుంటారు. కొండా ముర‌ళీ మీసం మెలేయ‌డం చ‌ర్చానీయాంశమైంది.

ఇక కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేసి త‌న‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేశార‌ని వ్యాఖ్యానించారు. కేబినెట్ నుంచి త‌న‌ను తొల‌గించే ఉద్దేశం హైక‌మాండ్‌కు లేద‌ని, 100 శాతం త‌న‌కు తెలుస‌ని చెప్పారు. నా బిడ్డ చేసిన వ్యాఖ్య‌ల‌ను త‌న మీద రుద్ది మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించ‌డాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఉరిశిక్ష వేసే ముందు ఖైదీని కూడా నీ చివ‌రి కోరిక ఏంట‌ని అడుగుతారు.. క‌నీసం త‌న వివ‌ర‌ణ కోరి ఉంటే బాగుండేద‌ని కొండా సురేఖ అన్నారు.

Advertisement
Advertisement