Kodair | ‘కోడేరు’కు 1300 ఏళ్ల చరిత్ర.. ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?
Kodair | కొన్ని గ్రామాల పేర్లు చిత్రవిచిత్రంగా ఉంటాయి. ఆ గ్రామానికి ఆ పేరు ఎలా వచ్చింది..? ఆ పేరుకేమైనా ప్రత్యేకత ఉందా..? అసలు ఏ నేపథ్యంలో ఆ పేరు వచ్చిందో తెలుసుకునేందుకు ఔత్సాహికులు ఆరాటపడుతుంటారు.ఎందుకంటే ఆ గ్రామాల పేర్లు అంత చిత్రంగా ఉంటాయి కాబట్టి. అలాంటి గ్రామాల జాబితాలో 'కోడేరు' అనే ఊరు చేరింది.
Kodair | త్రినేత్ర.న్యూస్ : కొన్ని గ్రామాల పేర్లు చిత్రవిచిత్రంగా ఉంటాయి. ఆ గ్రామానికి ఆ పేరు ఎలా వచ్చింది..? ఆ పేరుకేమైనా ప్రత్యేకత ఉందా..? అసలు ఏ నేపథ్యంలో ఆ పేరు వచ్చిందో తెలుసుకునేందుకు ఔత్సాహికులు ఆరాటపడుతుంటారు.ఎందుకంటే ఆ గ్రామాల పేర్లు అంత చిత్రంగా ఉంటాయి కాబట్టి. అలాంటి గ్రామాల జాబితాలో కోడేరు అనే ఊరు చేరింది. మరి ఆ ఊరు ఎక్కడుంది..? ఏ జిల్లాల్లో ఉంది..? ఆ ఊరికి 'కోడేరు' అనే పేరు ఎలా వచ్చిందో ఈ కథనంలో తెలుసుకుందాం.
నాగర్‌కర్నూల్ జిల్లా(ఉమ్మడి పాలమూరు) కేంద్రానికి 36 కిలోమీటర్లు, కొల్లాపూర్ నియోజకవర్గ పట్టణానికి 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న 'కోడేరు' గ్రామం గురించి మనం చెప్పుకుంటున్నాం. ఈ గ్రామానికి 1300 ఏళ్ల చరిత్ర ఉంది. అయితే 'కోడేరు' గ్రామం 5 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. గ్రామ జనాభా 10 వేలకు పైగా ఉంటుంది.
చారిత్రక నేపథ్యం ఇదే..
బాదామీ చాళుక్యల తరువాత రాష్ట్రకూట, కళ్యాణీ చాళుక్య, కందూరుచోళ, కాకతీయ, విజయనగర కాలాల్లోనూ..అనంతరం ముస్లిం పాలకులైన కుతుబ్‌షాహీ, అసఫ్‌జాహీల పాలనలోనూ కోడేరు కొనసాగింది. క్రీ.శ.12 శతాబ్దికి చెందిన చందిరెడ్డి, చౌండిరెడ్డి వేయించిన ఊరి నడిబొడ్డున ఉన్న చెన్నకేశవ స్వామి ఆలయం ఎదురుగా ఒక నిలువు రాయిపై శాసనం ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది. గ్రామానికి కోడు అనగా కోసగా ఎత్తుగా ఉన్న గుట్ట అని అర్థం. గ్రామానికి ఆనుకొని ఉన్న బలపాల(ఊరగుట్ట) ఉంది. ఇలా గుట్టలు ఉన్న గ్రామాల చివర ‘కోడు’ అన్నపదం ఉండటం సాధారణం. గుట్ట కొసను ఎంచుకున్నారు. ఇక ‘ఏరు’ అంటే పారే నీటి ప్రవాహం. గ్రామానికి సమీపంలో కుడి పక్కనే వాగు ఉంది. అదే ఖానాపూర్ వాగు (ఏరు) అంటారు. ఇలా రెండింటినీ కలిపి కోడు+ఏరు= కోడేరుగా నామకరణ చేసినట్లు చరిత్ర చెబుతోందని పురావస్తు శాఖ రాష్ట్ర అధికారి ఈమని శివనాగిరెడ్డి పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



