త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mallu Ravi | కిష‌న్‌రెడ్డి.. నిధులు తెచ్చి చిత్త‌శుద్ధిని చాటుకో: ఎంపీ మ‌ల్లు ర‌వి కౌంట‌ర్‌

Mallu Ravi | కేంద్ర ప్ర‌భుత్వం డ‌బ్బులు ఇస్తున్న‌ప్ప‌టికీ రాష్ట్రం ప్ర‌భుత్వం ధాన్యం కొన‌లేక‌పోతుంద‌ని కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి అన‌డం స‌రికాద‌ని ఎంపీ మ‌ల్లు ర‌వి మండిప‌డ్డారు. కేంద్ర మంత్రిగా ఉన్న ఆయ‌న‌ తెలంగాణ కు రావాల్సిన నిధులను తీసుకొచ్చి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని డిమాండ్ చేశారు.

S

Telangana | Published On May 18, 2026, 3.45 pm IST

Mallu Ravi | కిష‌న్‌రెడ్డి.. నిధులు తెచ్చి చిత్త‌శుద్ధిని చాటుకో: ఎంపీ మ‌ల్లు ర‌వి కౌంట‌ర్‌
Advertisement
  • ధాన్యం కొన‌డానికి కేంద్రం ఎన్ని డ‌బ్బులిచ్చిందో చెప్పు
  • పైగా తెలంగాణ సొమ్మును బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఖ‌ర్చు పెట్టేది నిజం కాదా?
  • కేంద్ర‌మంత్రిగా ఉన్న‌వ్‌.. నిధులు తీసుకురా
  • కిష‌న్‌రెడ్డికి ఎంపీ మ‌ల్లు ర‌వికి స‌వాల్‌

Mallu Ravi | త్రినేత్ర‌.న్యూస్: కేంద్ర ప్ర‌భుత్వం డ‌బ్బులు ఇస్తున్న‌ప్ప‌టికీ రాష్ట్రం ప్ర‌భుత్వం ధాన్యం కొన‌లేక‌పోతుంద‌ని కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి అన‌డం స‌రికాద‌ని నాగర్‌కర్నూల్ ఎంపీ మ‌ల్లు ర‌వి మండిప‌డ్డారు. కేంద్రం ఎక్క‌డి నుంచి డ‌బ్బులు ఇస్తుందో చెప్పాల‌న్నారు. ఇటీవ‌ల ధాన్యం కొనుగోలుపై కిష‌న్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై స్పందిస్తూ ఆయ‌న‌ కౌంట‌రిచ్చారు. కేంద్ర మంత్రిగా ఉన్న ఆయ‌న‌ తెలంగాణ కు రావాల్సిన నిధులను తీసుకొచ్చి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని డిమాండ్ చేశారు.

మేం రూపాయి ఇస్తే తిరిగి 42 పైస‌లే ఇస్తున్న‌రు..

కేంద్రం డబ్బులు ఇస్తుంటే రాష్ట్రంలో ప్రభుత్వం రైతుల వద్ద నుంచి ధాన్యం కొనడానికి ఏంటి సమస్య అని అంటున్నారు. కేంద్రం ఎక్కడ నుంచి డబ్బులు ఇస్తుందో ఆయ‌నే చెప్పాలి. తెలంగాణ నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో ఒక్క రూపాయి ఇస్తే మాకు 42 పైసలు తిరిగి ఇస్తున్నారు. మా తెలంగాణ డబ్బులను బీజేపీ రాష్ట్రాల్లో ఖ‌ర్చు పెడుతున్నారు. ఎవరి పైసలు ఎవరు ఇస్తున్నారు.. మన డబ్బులు మనకు ఇవ్వడానికే కేంద్రానికి చేతులు రావడం లేదు. ఇంకా ధాన్యం కొనుగోలుకు ప్రత్యేకంగా ఇస్తున్నారా అని కిష‌న్‌రెడ్డిని మ‌ల్లు ర‌వి నిల‌దీశారు.

అంత‌కుముందు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో ఏర్పాటు చేసిన రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (RSETI) ను సోమ‌వారం ప్రారంభించిన సంద‌ర్భంగా మ‌ల్లు ర‌వి మాట్లాడారు. గ్రామీణ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, నైపుణ్యాభివృద్ధి ద్వారా ఆర్థికంగా ఎదగడానికి ఈ శిక్షణా సంస్థ ఎంతో దోహదపడనుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, యూనియన్ బ్యాంక్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement