త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kishan Reddy | బండి భ‌గీర‌థ్ లొంగిపోయాడు క‌దా.. ఇష్యూ ఏముంది..! : కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి

Kishan Reddy | కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమారుడు బండి భ‌గీర‌థ్ లొంగిపోయాడు క‌దా.. ఇంక ఇష్యూ ఏముందని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి అన్నారు. ఈ కేసు విచార‌ణ జ‌రుగుతుంది. పోక్సో కేసు అనేది రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోని అంశం.. ఇందులో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌మేయం ఉండ‌ద‌ని కిష‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On May 17, 2026, 3.15 pm IST

Kishan Reddy | బండి భ‌గీర‌థ్ లొంగిపోయాడు క‌దా.. ఇష్యూ ఏముంది..! : కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి
Advertisement

Kishan Reddy | త్రినేత్ర‌.న్యూస్ : కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమారుడు బండి భ‌గీర‌థ్ లొంగిపోయాడు క‌దా.. ఇంక ఇష్యూ ఏముందని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి అన్నారు. ఈ కేసు విచార‌ణ జ‌రుగుతుంది. పోక్సో కేసు అనేది రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోని అంశం.. ఇందులో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌మేయం ఉండ‌ద‌ని కిష‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. నాంప‌ల్లిలోని బీజేపీ కార్యాల‌యంలో కిష‌న్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ ధాన్యం కొనుగోళ్లు చేయాలి. ధాన్యం కొనుగోళ్లకు ప్రతి పైసా కేంద్రమే ఇస్తోంది. కేంద్రం డబ్బులిస్తున్నా.. రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం ఎందుకు కొనడం లేదు..? ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ నెరవేర్చడం లేదు. సన్నవడ్లకు బోనస్‌ ఇవ్వడం లేదు. ధాన్యం కొనుగోళ్ల కోసం రైతులు ధర్నాలు చేస్తున్నారు. ప్రభుత్వమే వారికి సమాధానం చెప్పాలి. మంత్రులు జిల్లాలకు వెళ్లి, ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షించాలి అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

పెట్రోల్ ధ‌ర‌ల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌లు అసంబ‌ద్ధం. దేశంలోనే తెలంగాణ‌లో పెట్రోల్‌పై అత్య‌ధికంగా 35 శాతం వ్యాట్ విధిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎందుకు వ్యాట్ త‌గ్గించ‌డం లేదు. పెట్రోల్‌పై పెంచిన రూ. 3లో 35 శాతం రాష్ట్ర ప్ర‌భుత్వానికి వెళ్తుంది అని కిష‌న్ రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement