త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Khanapur | వెడ్మ బొజ్జు బెదిరింపులు.. ఖానాపూర్ మున్సిప‌ల్ చైర్మ‌న్ ఎన్నిక వాయిదా

Khanapur | కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు బెదిరింపులతో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా ప‌డింది. ఆదివారానికి ఎన్నిక‌ను వాయిదా వేసిన‌ట్లు ఎన్నిక‌ల అధికారులు అధికారికంగా ప్ర‌క‌టించారు.

S

Telangana | Published On Apr 4, 2026, 6.29 pm IST

Khanapur | వెడ్మ బొజ్జు బెదిరింపులు.. ఖానాపూర్ మున్సిప‌ల్ చైర్మ‌న్ ఎన్నిక వాయిదా
Advertisement

Khanapur | త్రినేత్ర‌.న్యూస్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు బెదిరింపులతో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా ప‌డింది. ఆదివారానికి ఎన్నిక‌ను వాయిదా వేసిన‌ట్లు ఎన్నిక‌ల అధికారులు అధికారికంగా ప్ర‌క‌టించారు. మున్సిప‌ల్ చైర్మ‌న్ ఎన్నిక‌కు చేతులు ఎత్తే క్ర‌మంలో కౌన్సిల‌ర్ల మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్ర‌మంలో అధికారుల‌తో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుకు తీవ్ర ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. త‌ద‌నంత‌రం ఎమ్మెల్యే బ‌య‌ట‌కు వెళ్లిపోయారు. మ‌రోవైపు మున్సిప‌ల్ ఆఫీసు ఎదుట బీఆర్ఎస్, బీజేపీ స‌భ్యులు ఆందోళ‌న‌కు దిగి నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఎమ్మెల్యే బెదిరింపుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వెడ్మ బొజ్జుకు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. అధికారుల‌ను బెదిరించ‌డం స‌రికాద‌ని మండిప‌డ్డారు.

ఖానాపూర్‌ మున్సిపాలిటీలో మొత్తం 12 కౌన్సిలర్‌ స్థానాలు ఉన్నాయి. ఇటీవల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 4, భాజపా 4, కాంగ్రెస్‌ 3, స్వతంత్రులు ఒకరు గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థి, ఎక్స్‌ అఫీషియో ఓటుతో కాంగ్రెస్‌ బలం ఐదుకు చేరింది. ముందుగా ఛైర్‌పర్సన్‌ ఎన్నిక వేళ బీజేపీ అభ్యర్థి మౌనిక పేరును అధికారులు ప్రతిపాదించారు. దీనిపై ఎమ్మెల్యే బొజ్జు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందుగా బీజేపీ అభ్యర్థి పేరు ఎలా ప్రతిపాదిస్తారంటూ ఆందోళనకు దిగారు. ఈ గందరగోళం నడుమే ఛైర్మన్‌ ఎన్నికను అధికారులు ఆదివారానికి వాయిదా వేశారు.

భూక్యా జాన్స‌న్ నాయ‌క్ నిర‌స‌న‌

మున్సిప‌ల్ అధికారుల తీరుపై బీఆర్ఎస్ నేత భూక్యా జాన్సన్ నాయక్ నిర‌స‌న‌కు దిగారు. వెంటనే ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. అధికారుల తీరును, ఎమ్మెల్యే వైఖరిని తీవ్రంగా ఖండించారు.

Advertisement
Advertisement