త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ajmeer Govind Naik | ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీర్ గోవింద్ నాయ‌క్ మృతి

Ajmeer Govind Naik | ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీర్ గోవింద్ నాయ‌క్(88) సోమ‌వారం మృతి చెందారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌.. దండేప‌ల్లి మండ‌ల ప‌రిధిలోని లింగాపూర్ గ్రామంలో తుదిశ్వాస విడిచిన‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు.

S

Telangana | Published On Mar 16, 2026, 7.40 pm IST

Ajmeer Govind Naik | ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీర్ గోవింద్ నాయ‌క్ మృతి
Advertisement

Ajmeer Govind Naik | త్రినేత్ర‌.న్యూస్ : ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీర్ గోవింద్ నాయ‌క్(88) సోమ‌వారం మృతి చెందారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌.. దండేప‌ల్లి మండ‌ల ప‌రిధిలోని లింగాపూర్ గ్రామంలో తుదిశ్వాస విడిచిన‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఆయ‌న‌కు భార్య‌, ముగ్గురు కుమారులు ఉన్నారు. అజ్మీద్ గోవింద్ నాయ‌క్ మృతిప‌ట్లు ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు సంతాపం ప్ర‌క‌టించారు. కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

లంబాడా క‌మ్యూనిటీకి చెందిన గోవింద్ నాయ‌క్.. 1985లో ఖానాపూర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 1994లో టీడీపీ టికెట్‌పై మ‌ళ్లీ గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2004లో బీఆర్ఎస్ టికెట్‌పై విజ‌యం సాధించి.. ముచ్చ‌ట‌గా మూడోసారి ఖానాపూర్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హించారు. తెలంగాణ ఉద్య‌మంలో గోవింద్ నాయ‌క్ కీల‌క పాత్ర పోషించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉమ్మ‌డి ఏపీలో రాజీనామా చేసిన 16 మంది ఎమ్మెల్యేల్లో గోవింద్ నాయ‌క్ కూడా ఉన్నారు. ఈ క్ర‌మంలో 2008లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో సుమ‌న్ ర‌మేశ్ రాథోడ్‌పై ఓడిపోయారు. ఇక అప్ప‌ట్నుంచి శాశ్వ‌తంగా రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు.

Advertisement
Advertisement