MLA Jagadish Reddy | కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు..
MLA Jagadish Reddy | కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు.. ఆయన నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన దీక్షా దివాస్ కార్యక్రమానికి జగదీశ్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష
కేసీఆర్ విలువ తెలంగాణ ప్రజలకు అర్థమైంది
దీక్షా దివస్‌లో ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు
MLA Jagadish Reddy | త్రినేత్ర న్యూస్ : కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు.. ఆయన నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన దీక్షా దివాస్ కార్యక్రమానికి జగదీశ్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ పెరుమాల్ల అన్నపూర్ణలతో పాటు నియోజకవర్గం వ్యాప్తంగా పెద్దఎత్తున పాల్గొన్న ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. చెరిపేస్తే చేరిగేది కాదు కేసీఆర్ చరిత్ర. అమ్మ విలువ, అన్నం విలువ అవి లేనప్పుడే తెలిసినట్టు.. కేసీఆర్ విలువ కూడా నేడు తెలంగాణ ప్రజలకు అర్థమైంది. తెలంగాణ సాధనలో కీలకమైన రోజు దీక్షా దివస్. పార్టీ ఏర్పాటు ఎంత కీలకమైందో.. దీక్ష దివాస్ అంతే కీలకమైంది. కోట్ల గొంతుకలను ఏకం చేసి.. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఘనుడు కేసీఆర్. తెలంగాణ చరిత్రలో నవంబర్ 29 మరువలేని రోజు.. కేసీఆర్, బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ అభివృద్ధి కోసం అని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.

60 ఏండ్ల నిర్లక్ష్యాన్ని ఎండగట్టి.. అద్భుత ప్రగతిని చూపించిండు కేసీఆర్. అభివృద్ధి, సంక్షేమాలతో రాష్ట్రాన్ని యావత్ దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత కేసీఆర్‌ది. చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ చేసిన ఆమరణ దీక్ష చరిత్రలో నిలబడుతుంది. కుట్రలు, కుతంత్రాలను ఛేదించి ప్రజాస్వామ్య పద్దతుల్లో తెలంగాణ సాధించిండు. కేసీఆర్ త్యాగం, రాష్ట్ర సాధన ప్రజలకు, ముందు తరాలకు తెలిపేందుకు దీక్షా దివస్. తన స్వప్నం.. తన ధ్యేయం తెలంగాణా అని.. ప్రాణాలు పణంగా పెట్టిన ఉద్యమ నేత.. వెనకకు పోతే రాళ్లతో కొట్టండి అని ప్రకటించిన ధీరోదత్తుడు కేసీఆర్.. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు. ఎప్పటికైనా స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు.
యావత్ తెలంగాణ సమాజానికి కేసీఆరే సరైన నాయకుడు. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం సమైక్యాంధ్ర వాదుల తొత్తుగా మారింది. మోసపూరిత హామీలతో అధికారం చేపట్టింది కాంగ్రెస్. స్వార్ధ రాజకీయాల కోసం రేవంత్ రాష్ట్రాన్ని ఆగం చేస్తుండు. పాలన చేతకాక ప్రజలను ఆగమాగం చేస్తున్నరు. మూడేండ్ల పాలనలో అన్నిరంగాలను భ్రష్టు పట్టించిండ్రు. ఆది నుంచే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. కాంగ్రెస్ అంటేనే ప్రజలు చీదరించుకునే పరిస్థితి ఏర్పడింది.కేసీఆర్ అవసరాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. మళ్ళీ కేసీఆరే రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని జగదీశ్ రెడ్డి తెలిపారు.
డిసెంబర్ 10 న కేటీఆర్ నీళ్లపై పోరాట సభను విజయవంతం చేద్దాం. కృష్ణా, గోదావరి జలాలపై మన హక్కులను కాపాడుకుందాం. తెలంగాణ ఏర్పాటుపై ఆనాడు చంద్రబాబు చేయని కుట్రలు లేవు. నేడు కూడా అదే విషబుద్ధితో తెలంగాణ నీళ్లను దోచుకుంటున్నడు. మన నీళ్లను మనం కాపాడుకునేందుకు నల్లగొండలో కేటీఆర్ సభను విజయవంతం చేయాలని జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు.
తాజావార్తలు
- ●Delimitation Bill 2026 | లోక్‌సభలో మోదీ సర్కార్ మార్క్ '371'.. డీలిమిటేషన్ బిల్లు గట్టెక్కేదిలా!
- ●Keerthy Suresh | బ్లాక్‌డ్రెస్‌లో కీర్తి సురేష్ అందాల హోయలు
- ●KTR | రేవంత్ రెడ్డి నోట.. కేసీఆర్ పేరు కోటి సార్లు
- ●Renu Desai | గుడికి వెళ్లి పూజలు చేస్తారు... కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్లను పట్టించుకోరు - రేణుదేశాయ్ కామెంట్స్ వైరల్
- ●Delimitation Bill 2026 | స్టాలిన్‌ను ఒప్పించలేకపోయిన సోనియా, రాహుల్.. గంటపాటు సాగిన చర్చలు విఫలం!
- ●KTR | 90 సీట్లు కాదు.. 900 ఫీట్ల లోతున కాంగ్రెస్‌ను పాతి పెడుతాం

Delimitation Bill 2026 | లోక్‌సభలో మోదీ సర్కార్ మార్క్ '371'.. డీలిమిటేషన్ బిల్లు గట్టెక్కేదిలా!

Keerthy Suresh | బ్లాక్‌డ్రెస్‌లో కీర్తి సురేష్ అందాల హోయలు

KTR | రేవంత్ రెడ్డి నోట.. కేసీఆర్ పేరు కోటి సార్లు

Renu Desai | గుడికి వెళ్లి పూజలు చేస్తారు... కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్లను పట్టించుకోరు - రేణుదేశాయ్ కామెంట్స్ వైరల్





