త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shah Rukh Khan | నిమిషానికి యాభై ల‌క్ష‌ల సంపాద‌న‌.. షారుఖ్‌ రేంజ్ వేరే లెవెల్‌

ఇటీవ‌ల ఉద‌య్‌పూర్‌లో ఓ బిజినెస్‌మెన్ కొడుకు పెళ్లి వేడుక‌లో షారుఖ్‌ఖాన్ డ్యాన్స్ చేసిన వీడియోలు, ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఈ పెళ్లి వేడుక‌లో ఇర‌వై నిమిషాల డ్యాన్స్ ప‌ర్ఫార్మెన్స్ కోసం షారుఖ్‌ఖాన్ తీసుకున్న రెమ్యూన‌రేష‌న్ బాలీవుడ్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నిమిషానికి యాభై ల‌క్ష‌ల రెమ్యూన‌రేష‌న్ స్వీక‌రించిన‌ట్లు చెబుతోన్నారు.

N

Entertainment | Published On Nov 29, 2026, 5.38 pm IST

Shah Rukh Khan |  నిమిషానికి యాభై ల‌క్ష‌ల సంపాద‌న‌.. షారుఖ్‌ రేంజ్ వేరే లెవెల్‌
Advertisement

Shah Rukh Khan | ఇండియాలోనే రిచెస్ట్ యాక్ట‌ర్‌గా కొన‌సాగుతోన్నారు షారుఖ్‌ఖాన్‌ (Shah Rukh Khan). బాలీవుడ్ (Bollywood)బాద్‌షా మొత్తం ఆస్తి ప‌ది వేల కోట్ల‌కుపైనే ఉంటుంద‌ని అంచ‌నా. ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి ముప్పై ఏళ్లు దాటింది. ఇప్ప‌టికీ బాలీవుడ్‌లో నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతోన్నాడు షారుఖ్‌ఖాన్‌. సినిమాల్లోనే కాకుండా బిజినెస్‌లోనూ రాణిస్తున్నారు.

యాక్ట‌ర్‌గా కోట్ల‌లో...

యాక్ట‌ర్‌గా కోట్ల‌లో రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్న షారుఖ్‌ఖాన్ పెళ్లి వేడుక‌ల్లో డ్యాన్సులు చేయ‌డం ద్వారా భారీగానే సంపాదిస్తోన్న‌ట్లు స‌మాచారం. ఇటీవ‌ల ఉద‌య్‌పూర్‌లో జ‌రిగిన ఓ బిజినెస్‌మెన్ కొడుకు పెళ్లి వేడుక‌లో షారుఖ్‌ఖాన్ పాల్గొన్నాడు. పెళ్లికి వ‌చ్చిన ఆహుతుల‌ను త‌న డ్యాన్స్‌తో అల‌రించాడు. దాదాపు ఇర‌వై నిమిషాల పాటు షారుఖ్‌ఖాన్ డ్యాన్స్ ప‌ర్ఫార్మెన్స్ సాగిన‌ట్లు స‌మాచారం. ఈ వేడుక‌కు షారుఖ్‌ఖాన్‌తో పాటు సింగ‌ర్ సోనూ నిగ‌మ్ కూడా స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచాడు.

నిమిషానికి యాభై ల‌క్ష‌లు...

ఈ పెళ్లిలో డ్యాన్స్ చేసినందుకు షారుఖ్‌ఖాన్ తీసుకున్న రెమ్యూన‌రేష‌న్ బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇర‌వై నిమిషాల కోసం ఈ టాప్ హీరో దాదాపు ప‌ది కోట్లు ఛార్జ్ చేసిన‌ట్లు చెబుతున్నారు. నిమిషానికి యాభై ల‌క్ష‌లు సంపాదించిన‌ట్లు స‌మాచారం. షారుక్ రేంజ్ నెక్స్ట్ లెవెల్ అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

షారుఖ్‌ఖాన్ కూతురు...

ప్ర‌స్తుతం కింగ్ సినిమాలో హీరోగా న‌టిస్తోన్నాడు షారుఖ్‌ఖాన్‌. సిద్దార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ డిసెంబ‌ర్ 24న రిలీజ్ కాబోతుంది. గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో దీపికా ప‌దుకొణే (Deepika Padukone) హీరోయిన్‌గా న‌టిస్తోంది. షారుఖ్‌ఖాన్ కూతురు సుహానా ఖాన్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతుంది.

 

Advertisement

తాజావార్తలు

Advertisement