త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sonia Gandhi Movie | సోనియా సినిమాకు ద‌ర్శ‌కుడిని ఎంపిక చేసిన జ‌గ్గారెడ్డి.. ఆయ‌న ఎవ‌రంటే!

Sonia Gandhi Movie | తాము సోనియా గాంధీ (Sonia Gandhi) పై తీసే సినిమాకు క్రాంతి మాధ‌వ్‌ ద‌ర్శ‌క‌త్వం (Director Kranthi Madhav) వ‌హిస్తార‌ని.. వ‌చ్చే నెల‌లో ఆమె అనుమ‌తి తీసుకుంటామ‌ని టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జ‌గ్గారెడ్డి (Jaggareddy) తెలిపారు.

S

Telangana | Published On Nov 29, 2026, 3.38 pm IST

Sonia Gandhi Movie | సోనియా సినిమాకు ద‌ర్శ‌కుడిని ఎంపిక చేసిన జ‌గ్గారెడ్డి.. ఆయ‌న ఎవ‌రంటే!
Advertisement
  • ఎలాంటి రాజ‌కీయ‌, ఆర్థిక ప్ర‌యోజ‌నాలు ఆశించం
  • ఎవ‌రి నుంచి ఒక్క పైసా తీసుకోం.. 50 మంది ఫైనాన్స్ క‌మిటీతో పూర్తి చేస్తాం
  • దేశ, విదేశాల ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యేలా మూవీ ఉంటుంది
  • టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జ‌గ్గారెడ్డి వెల్ల‌డి

Sonia Gandhi Movie | త్రినేత్ర న్యూస్‌: తాము సోనియా గాంధీ (Sonia Gandhi) పై తీసే సినిమాకు క్రాంతి మాధ‌వ్‌ ద‌ర్శ‌క‌త్వం (Director Kranthi Madhav) వ‌హిస్తార‌ని.. వ‌చ్చే నెల‌లో ఆమె అనుమ‌తి తీసుకుంటామ‌ని టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జ‌గ్గారెడ్డి (Jaggareddy) తెలిపారు. ఎవరి నుంచి ఒక్క పైసా తీసుకోమని, మా సంగారెడ్డి నియోజకవర్గ కార్యకర్తలు 50 మందితో ఫైనాన్స్ కమిటీ వేసి తామే సినిమా తీస్తామని చెప్పారు. సోనియాగాంధీ రాసిన ఆత్మకథ పుస్తకాన్ని దేశ, విదేశీ ప్రజలకు మరింత స్పష్టంగా అర్థమయ్యేలా చూపించేందుకు సినిమా తీస్తున్నామ‌ని వివ‌రించారు. ఈ మేర‌కు ఆయ‌న ఆదివారం ద‌ర్శ‌కులు క్రాంతి మాద‌న్‌ను క‌లిసిన సంద‌ర్భంగా మాట్లాడారు.

సోనియా గాంధీ సినిమాకు క్రాంతి మాధ‌వ్‌ పేరును ఎంపిక హరి ప్రసాద్‌తో క‌లిసి ఎంపిక చేశాం. డిసెంబర్ 10 నుంచి ఢిల్లీకి వెళ్లి సోనియాగాంధీ అనుమతి తీసుకుంటాం. సోనియా త‌న ఆత్మకథ బిలాంగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్ బుక్ లోని ప్రధానాంశాలను కథాంశాలుగా తీసుకుంటాం. ఎలాంటి రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు ఆశించకుండా కేవలం గాంధీ కుటుంబ నేపథ్యంలోనే ఈ సినిమా నిర్మించ‌బోతున్నాం.

సోనియాగాంధీ, రాజీవ్ గాంధీల ప్రేమ కథ, ఇందిరా, రాజీవ్ గాంధీల బలిదానాలు, దేశం కోసం వారి త్యాగాలు, ఇందిరా, రాజీవ్ గాంధీల అనంతరం సోనియాగాంధీ, దేశం కోసం సోనియా చేసిన సేవలు, ప్రజల కోసం రాజకీయ ప్రవేశం.. ప్రధాన మంత్రి పదవుల త్యాగం.. పేద ప్రజల కోసం సంచలన నిర్ణయాల వంటివన్నీ సినిమాలో స్పష్టంగా చూపిస్తామ‌న్నారు.

ఓన‌మాలు మూవీతో..

ఖ‌మ్మం జిల్లాకు చెందిన క్రాంతి మాధ‌వ్ గ‌తంలో ఓనమాలు చిత్రంతో ద‌ర్శ‌కుడిగా తెలుగు చిత్ర‌సీమ‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఉంగరాల రాంబాబు, వరల్డ్ ఫెమస్ లవర్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు, చెన్నై తెలుగు అకాడమీ అవార్డులు గెలుచుకున్నారు.

Advertisement
Advertisement