త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mandya Girl Suicide | మావాన్ని ప్రేమించి పెళ్లి చేసుకోకుంటే బ‌త‌క‌వ్‌.. బాలిక‌కు స్నేహితుల వార్నింగ్‌.. త‌ర్వాత ఏం చేశారంటే!

Mandya Girl Suicide | ఆ బాలిక‌కు 17 ఏళ్లే. అయినా త‌మ‌వాన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాల‌ని.. లేదంటే చంపెస్తామంటూ ఆమెను బెదిరించారు. ఆ తర్వాత ఏం చేశారంటే..

S

National | Published On Nov 29, 2026, 4.52 pm IST

Mandya Girl Suicide | మావాన్ని ప్రేమించి పెళ్లి చేసుకోకుంటే బ‌త‌క‌వ్‌.. బాలిక‌కు స్నేహితుల వార్నింగ్‌.. త‌ర్వాత ఏం చేశారంటే!
Advertisement

Mandya Girl Suicide | త్రినేత్ర న్యూస్‌: ఆ బాలిక‌కు 17 ఏళ్లే. అయినా త‌మ‌వాన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాల‌ని.. లేదంటే చంపెస్తామంటూ ఆమెను బెదిరించారు. త‌ప్ప‌ని తెలిసినా క్రూరంగా ప్ర‌వ‌ర్తించారు. ఈ వేధింపుల‌ను తాళ‌లేని బాలిక (Girl Suicide) త‌నువు చాలించిన విషాద ఘ‌ట‌న క‌ర్ణాట‌క (Karnataka) రాష్ట్రం మండ్య (Mandya) తాలూకా చంద‌గాలు గ్రామంలో చోటుచేసుకుంది.

మృతురాలి తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని వివరాల మేర‌కు.. చంద‌గాలు గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక‌ను అదే గ్రామానికి చెందిన‌ శోభిత్‌ గౌడ అనే యువకుడు కొన్ని రోజులుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. బాలిక వ‌ద్ద‌న్నా వెంట పడేవాడు. దీంతో ఈ విషయాన్ని బాలిక త‌న‌ తల్లిదండ్రులకు చెప్పింది. గ్రామ పెద్దలతో పంచాయతీ పెట్టారు. శోభిత్‌ గౌడను అదుపులో పెట్టుకోవాల‌ని అత‌డి తండ్రికి పెద్ద‌మ‌నుషులు సూచించారు.

అయినా శోభిత్‌గౌడ ప్రవర్తనలో మార్పు రాలేదు. త‌న‌ స్నేహితులు క్రిషిక్‌ గౌడ, లేవిత్, మనోజ్‌ గౌడలతో కలిసి ఆ బాలిక ఇంట్లోకి చొరబడ్డారు. బాలిక‌తో పాటు, ఆమె తల్లిదండ్రులను బ‌య‌ట‌కు ఈడ్చుకొచ్చి బూతులతో దూషించారు. శోభిత్‌ గౌడను పెళ్లి చేసుకోకుంటే చంపేస్తామంటూ అతని స్నేహితులు బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారు. ఇంత‌టితో ఆగ‌కుండా క్రిషిక్‌ గౌడ కొడవలితో బాలిక‌ తండ్రిపై దాడి చేసి గాయపరిచాడు.

ఇది చూసిన బాలిక తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లోకి వెళ్లి చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. బాధితురాలిని హుటాహుటిన మిమ్స్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదుతో ఎస్పీ శోభారాణి, ఇతర ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. శివల్లి పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
Advertisement