KCR | పెద్ది కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ.2.25 కోట్లు అందించాలని నిర్ణయం
KCR | దివంగత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది కుటుంబానికి కేసీఆర్ కొండంత అండగా నిలిచి భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. పార్టీ తరఫున 2.25 కోట్ల రూపాయలను అందజేయాలని నిర్ణయించారు. వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
KCR | త్రినేత్ర.న్యూస్: నర్సంపేట దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది కుటుంబానికి కేసీఆర్ కొండంత అండగా నిలిచి భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. పార్టీ తరఫున 2.25 కోట్ల రూపాయలను అందజేయాలని నిర్ణయించారు. వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి నమ్మకంగా పనిచేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో కన్నుమూయడంతో, ఆయన కుటుంబ బాధ్యతలను పార్టీ తరఫున తామే చూసుకుంటామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఈమేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లల పేరు మీద చెరో కోటి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మ వృద్ధాప్యంలో ఉండడంతో వారి బాగోగుల కోసం మరో 25 లక్షలు రూపాయలను తల్లి పేరు మీద బ్యాంకులో జమ చేయాలన్నారు. మొత్తంగా, 2.25 కోట్ల రూపాయలను పెద్ది కుటుంబానికి భారత రాష్ట్ర సమితి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ అండగా నిలవాలని నిర్ణయించింది.
పిల్లల భవిష్యత్తు, వారి చదువు తదితర కుటుంబ సంక్షేమానికి సంబంధించి పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ అండగా నిలుస్తుందని అధినేత కేసీఆర్ తెలిపారు. కాగా పెద్ది దశదినకర్మల కార్యక్రమాలు ముగిసిన తర్వాత జిల్లా పార్టీ ముఖ్యులు సమావేశమై వారి కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారని, ఎల్లకాలం వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్ పునరుద్ఘాటించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●KTR | యూఏఈలో బతుకమ్మ సంబురాలు.. కేటీఆర్‌కు ఆహ్వానం
- ●Anil Kumar Eravathri | కేటీఆర్‌కు హాఫ్ నాలెడ్జ్..
- ●Korean Kanakaraju Vs DC | లోకేష్ కనగరాజ్ వర్సెస్ కొరియన్ కనకరాజు ... ఫస్ట్ డే విన్నర్ ఎవరంటే?
- ●E20 Petrol | ఈ20 పెట్రోల్‌పై ఆయిల్ కంపెనీల స్పష్టత.. నీరు ఉందా, లేదా..?
- ●PM Modi | ప్రశ్నించడం కాదు.. సమస్యలకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా ఉండాలి.. యువతకు ప్రధాని కీలక సూచన
- ●OTT Review | ఇల్లీగల్ ఎఫైర్స్‌పై వచ్చిన మలయాళం మూవీ - ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో సాగే థ్రిల్లర్ సినిమా ఎలా ఉందంటే?

KTR | యూఏఈలో బతుకమ్మ సంబురాలు.. కేటీఆర్‌కు ఆహ్వానం

Anil Kumar Eravathri | కేటీఆర్‌కు హాఫ్ నాలెడ్జ్..

Korean Kanakaraju Vs DC | లోకేష్ కనగరాజ్ వర్సెస్ కొరియన్ కనకరాజు ... ఫస్ట్ డే విన్నర్ ఎవరంటే?

E20 Petrol | ఈ20 పెట్రోల్‌పై ఆయిల్ కంపెనీల స్పష్టత.. నీరు ఉందా, లేదా..?





