త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavitha | మే మొద‌టి వారంలో కవిత కొత్త పార్టీ.. ఎక్క‌డి నుంచి పోటీచేస్తారంటే?

G

Telangana | Published On Feb 19, 2026, 12.43 pm IST

Kavitha | మే మొద‌టి వారంలో కవిత కొత్త పార్టీ.. ఎక్క‌డి నుంచి పోటీచేస్తారంటే?
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో మ‌రో కొత్త రాజ‌కీయ పార్టీ ఆవిర్భ‌వించ‌నుంది. గ‌త కొన్ని రోజులుగా జ‌నం బాట పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తున్న‌ మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత (Kavitha) నేతృత్వంలో పార్టీ ఏర్పాటు కానుంది. ఈ ఏడాది మే మొద‌టి వారంలో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు కవిత ప్రకటించారు. మే మొదటి వారంలో ముహూర్తం చూసుకుని పార్టీ పేరు ప్రకటిస్తామని తెలిపారు. హైద‌రాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాల‌యంలో క‌విత మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా పార్టీ ఏర్పాటుపై అధికారికంగా ప్ర‌క‌టించారు. పార్టీ పేరులో తెలంగాణ ఉంటుందని చెప్పారు. ఎన్నికల్లో సిద్దిపేట, బోధన్‌లో ఒకచోటి నుంచి తాను పోటీ చేస్తానని తెలిపారు. సిద్దిపేటకు మొద‌టి ప్రాధాన్యత ఇస్తాన‌న్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చాల‌ని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల‌న్నారు. ఆర్టీసీలో తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి ప్ర‌భుత్వాన్ని కోరారు. అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా యూనియన్లపై నిషేధం ఎత్తివేస్తామన్నారు, ఆ సంగ‌తి ఏమైంది ప్ర‌శ్నించారు. ఫ్రీ బస్సులు ఎవరి కోసం, ఎందుకోసం పెట్టారని ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. ఉచిత ప్ర‌యాణంతో మ‌హిళ‌లకు ఆత్మ‌గౌర‌వం లేకుండా చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఫ్రీ బస్సు పేరుతో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం, రద్దీకి తగ్గట్టు బస్సులు మాత్రం పెంచలేదు. దీంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మ‌రోవైపు త‌మ‌కెందుకు ఫ్రీ ఇవ్వ‌ర‌ని దివ్యాంగులు అడుగుతున్నార‌ని వెల్లడించారు. ఓవ‌ర్ లోడ్ అయిన బ‌స్సులు బ‌స్ స్టాపుల్లో కాకుండా దూరంగా ఆగుతున్నాయ‌న్నారు. విక‌లాంగులు ఎవ‌రూ బ‌స్సుల్లో వెళ్లే ప‌రిస్థితి లేద‌ని చెప్పారు. విక‌లాంగుల‌కు కూడా ఉచిత బ‌స్సు ప్ర‌యాణం సౌక‌ర్యం క‌ల్పించాల‌ని డిమాండ్ చేశారు.

https://x.com/RaoKavitha/status/2024360546645205339

Advertisement
Advertisement