త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Damodar Raja Narasimha | దేశంలోనే అత్య‌ధిక సిజేరియ‌న్లు క‌రీంన‌గ‌ర్ జిల్లాలో

Damodar Raja Narasimha | గత పదేండ్ల రికార్డు చూసుకుంటే.. దేశంలోనే అత్యధికశాతం సిజేరియన్( Caesarean ) డెలివరీలు ఉమ్మడి కరీంనగర్‌‌ జిల్లా( Karimnagar District )లోనే జరుగుతున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ‌ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ ఆందోళన వ్యక్తం చేశారు.

S

Telangana | Published On Jul 28, 2026, 5.55 pm IST

Damodar Raja Narasimha | దేశంలోనే అత్య‌ధిక సిజేరియ‌న్లు క‌రీంన‌గ‌ర్ జిల్లాలో
Advertisement
  • న‌ర్సుల‌కు మిడ్‌వైఫ‌రీ ట్రైనింగ్
  • జ‌గిత్యాల మెడిక‌ల్ కాలేజీలో పీజీ డిపార్ట్‌మెంట్లు
  • ఎన్ఎంసీకి ద‌ర‌ఖాస్తు చేయాల‌ని మంత్రి దామోద‌ర ఆదేశం

Damodar Raja Narasimha | త్రినేత్ర‌.న్యూస్ : గత పదేండ్ల రికార్డు చూసుకుంటే.. దేశంలోనే అత్యధికశాతం సిజేరియన్( Caesarean ) డెలివరీలు ఉమ్మడి కరీంనగర్‌‌ జిల్లా( Karimnagar District )లోనే జరుగుతున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ‌ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల్లో ఉన్న నమ్మకాలు, కొంత మంది డాక్టర్ల తొందరపాటు, ఇతర కారణాలతో సిజేరియన్లు ఎక్కువగా జరుగుతున్నాయని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మంత్రికి వివరించారు. సిజేరియన్లు తగ్గించే చర్యలు చేపట్టాలని మంత్రిని కోరారు. సిజేరియన్ డెలివరీలు తగ్గించేందుకు ప్రభుత్వ హాస్పిటళ్లలో పనిచేసే నర్సులకు మిడ్‌వైఫరీ ట్రైనింగ్ ఇప్పిస్తున్నామని మంత్రి తెలిపారు.

రాష్ట్ర స‌చివాల‌యంలో మంగ‌ళ‌వారం జ‌గిత్యాల మెడిక‌ల్ కాలేజీ, జీజీహెచ్‌, ఇత‌ర హాస్పిట‌ళ్ల ప‌నితీరుపై మంత్రి స‌మీక్ష చేశారు. జ‌గిత్యాల ఎమ్మెల్యే సంజ‌య్, కోరుట్ల ఎమ్మెల్యే క‌ల్వ‌కుంట్ల సంజ‌య్‌తో క‌లిసి మంత్రి దామోద‌ర‌.. జిల్లాలోని ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, హాస్పిటళ్ల అభివృద్ధి పనులు, మౌలిక వసతులు, ఇతర అంశాలపై స‌మీక్షించారు. జగిత్యాల మెడికల్ కాలేజీ, జనరల్ హాస్పిటల్, సబ్ సెంటర్లు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా హాస్పిటళ్ల పనితీరుపై ఆరా తీశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జగిత్యాల ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో అన్నిరకాల స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. అత్యాధునిక వసతులతో కూడిన హాస్పిటల్ భవనం నిర్మిస్తున్నామని, కొత్త హాస్పిటల్‌లో అన్నిరకాల స్పెషాలిటీ వైద్య సేవలను ప్రారంభిస్తామన్నారు. కోరుట్ల‌, మెట్‌ప‌ల్లి స‌హా అన్ని ఆస్ప‌త్రుల‌కు డాక్ట‌ర్ల‌ను కేటాయిస్తామ‌న్నారు. జగిత్యాల‌ మెడికల్ కాలేజీలో ముఖ్యమైన అన్నిరకాల పీజీ డిపార్ట్‌మెంట్లను ప్రారంభించాలని నిర్ణయించామని మంత్రి వెల్లడించారు. పీజీ సీట్ల కోసం వెంటనే నేషనల్ మెడికల్ కమిషన్‌కు దరఖాస్తు చేయాలని మెడికల్ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌‌ను మంత్రి ఆదేశించారు.

జగిత్యాల జీజీహెచ్‌ పనితీరు మెరుగుపడిందని, హాస్పిటల్‌కు ఓపీ, ఐపీ సంఖ్య పెరిగిందని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వివరించారు. హాస్పిటల్ కోసం కొత్త భవనం మంజూరు చేసినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కోరుట్ల ఏరియా హాస్పిటల్‌లో గతంలో సగటున 550 డెలివరీలు జరిగితే, ప్రస్తుతం 950 వరకూ జరుగుతున్నాయని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తెలిపారు. అయితే, సిజేరియన్ డెలివరీలు ఎక్కువగా జరుగుతున్నాయని, నార్మల్ డెలివరీ సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. హాస్పిటళ్లకు వచ్చే పేషెంట్ల సంఖ్య పెరిగినందున.. కోరుట్ల ఏరియా హాస్పిటల్‌, మెట్‌పల్లి కమ్యునిటీ హెల్త్ సెంటర్‌‌లో కేడర్ స్ట్రెంత్‌ను పెంచాలని కల్వకుంట్ల సంజయ్‌ కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు.

ఈ స‌మీక్ష స‌మావేశంలో ఆరోగ్య శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ క్రిస్టినా జ‌డ్‌చొంగ్తు, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ గౌరవ్ ఉప్పల్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, డీఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డాక్టర్ రవీందర్ నాయక్, జగిత్యాల్ జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌, డాక్టర్ కృష్ణమూర్తి, డీఎంహెచ్‌వో డాక్టర్ సుజాత, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్ రామకృష్ణ, ఇతర ఉన్నతాధికారులు, హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement