Khushi Kapoor | అతిలోక సుందరి శ్రీదేవి చివరి సినిమాకు సీక్వెల్ – హీరోయిన్‌గా జాన్వీ కపూర్ చెల్లెలు
అతిలోక సుందరి శ్రీదేవి నటించిన చివరి సినిమా మామ్‌కు సీక్వెల్ రాబోతుంది. ఈ సీక్వెల్‌లో శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సీక్వెల్ రిలీజ్‌పై బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికర న్యూస్ చక్కర్లు కొడుతోంది.
Naresh N
Entertainment | Published On Jul 28, 2026, 5.55 pm IST

దివగంత నటి శ్రీదేవి కెరీర్‌లో చివరి మూవీగా మామ్ నిలిచింది. శ్రీదేవి మరణానికి ఏడాది ముందు ఈ బాలీవుడ్ మూవీ థియేటర్లలోకి వచ్చింది.

ఈ సినిమాలో తన కూతురికి జరిగిన అన్యాయంపై పోరాడే తల్లిగా శ్రీదేవి అసమాన నటనను కనబరిచింది. మామ్ సినిమాకుగాను శ్రీదేవికి ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ దక్కింది.

దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మామ్ మూవీకి సీక్వెల్ రాబోతుంది. మామ్ 2 పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

మామ్ 2 మూవీ షూటింగ్ కంప్లీట్ అయినట్లు సమాచారం. నవంబర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు నిర్మాత బోనీ కపూర్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.

మామ్ 2 కంటే ముందు బాలీవుడ్‌లో ఖుషి కపూర్ రెండు సినిమాలు చేసింది. నాదనియాన్, లవ్ యాపాలో హీరోయిన్‌గా నటించింది.

సౌత్ రీమేక్‌లుగా రూపొందిన ఈ రెండు సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి.

తల్లి శ్రీదేవి మూవీ సీక్వెల్‌తో కెరీర్‌లో ఫస్ట్ హిట్టు అందుకోవాలని ఖుషి కపూర్ ఆశపడుతోంది. ఈ సినిమాలో కరిష్మా తన్హా, జిషు సేన్ గుప్తా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

అక్క జాన్వీ బాటలోనే త్వరలోనే ఖుషి కపూర్ తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
- ●Heavy Rains | భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి.. కలెక్టర్లకు సీఎస్ కీలక ఆదేశాలు..
- ●SIP | రూ.1 కోటి కార్పస్‌ను నిర్మించాలంటే.. ఏ వయస్సులో ఎంత ఎస్ఐపీ చేయాలి..?
- ●Prajavani | ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్
- ●Mrunal Thakur | తూచ్ ... అంతా వట్టిదే - టీమిండియా క్రికెటర్‌తో డేటింగ్ రూమర్లపై మృణాల్ టీమ్ క్లారిటీ
- ●B.Optometry | హెచ్‌సీయూలో 'ఆప్టోమెట్రీ' డిగ్రీ కోర్సు.. 'నీట్' మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు
- ●Akhilesh Yadav | మోదీని కాపాడేందుకే ప్రధాన్‌ను తొలగించారు : అఖిలేష్ యాదవ్

Heavy Rains | భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి.. కలెక్టర్లకు సీఎస్ కీలక ఆదేశాలు..

SIP | రూ.1 కోటి కార్పస్‌ను నిర్మించాలంటే.. ఏ వయస్సులో ఎంత ఎస్ఐపీ చేయాలి..?

Prajavani | ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్

Mrunal Thakur | తూచ్ ... అంతా వట్టిదే - టీమిండియా క్రికెటర్‌తో డేటింగ్ రూమర్లపై మృణాల్ టీమ్ క్లారిటీ


