Lovlina Borgohain | పుట్టినరోజు బహుమతి.. బాక్సింగ్‌లో లవ్లీనా గోల్డ్‌మెడల్
Lovlina Borgohain | భారత మహిళా స్టార్ బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ (Lovlina Borgohain) పుట్టినరోజున తనకు తానే చక్కటి బహుమతి ఇచ్చుకుంది. ఆసియా క్రీడల్లో (Asian Games) భాగంగా నిషియో జిమ్నాసియంలో జరిగిన మహిళల బాక్సింగ్ 75 కిలోల (boxing) విభాగంలో తన అద్భుత ప్రదర్శనతో స్వర్ణం గెలుచుకుంది.
Lovlina Borgohain | త్రినేత్ర న్యూస్: భారత మహిళా స్టార్ బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ (Lovlina Borgohain) పుట్టినరోజున తనకు తానే చక్కటి బహుమతి ఇచ్చుకుంది. ఆసియా క్రీడల్లో (Asian Games) భాగంగా నిషియో జిమ్నాసియంలో జరిగిన మహిళల బాక్సింగ్ 75 కిలోల (boxing) విభాగంలో తన అద్భుత ప్రదర్శనతో స్వర్ణం గెలుచుకుంది. 75 కేజీల విభాగంలో చైనా బాక్సర్ జియి బావోతో (Ziyi Bao) హోరాహోరీగా జరిగిన ఫైనల్‌లో 5-0 తేడాతో విజయం సాధించింది.
బావోపై లవ్లీనా తొలి నుంచి ఆధిపత్యం ప్రదర్శించింది. వరుసగా రెండు రౌండ్లలోనే చైనా బాక్సర్‌ను మట్టికరించి 2-0 తేడాతో గెలుపొందింది. దీంతో 2014లో మేరీ కోమ్ (Mary Kom) తర్వాత ఏషియన్ గేమ్స్‌లో బంగారు పతకం (Gold Medal) సాధించిన తొలి మహిళా బాక్సర్‌గా, ఆసియా క్రీడల్లో భారత్‌కు స్వర్ణం, రజతం అందించిన తొలి బాక్సర్‌గా నిలిచింది. 2022లో లవ్లీనా రజతం అందుకున్న విషయం తెలిసిందే.
29 ఏండ్ల లవ్లీనా బోర్గోహైన్.. 1997 అక్టోబర్ 2న అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలోని బరోముఖియా జన్మించింది. తన సోదరీ మణులను ఆదర్శంగా తీసుకుని బాక్సింగ్‌లోకి ప్రవేశించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమె పాఠశాలలో నిర్వహించిన ట్రయల్స్‌లో గుర్తించడంతో 2012లో బాక్సింగ్‌లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే ఒలింపిక్ క్రీడలు, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు, ఆసియా క్రీడలు, ఆసియా ఛాంపియన్‌షిప్‌లలో పతకాలు గెలుచుకుంది.
HISTORIC GOLD FOR BHARAT! 🇮🇳🥇
Heartiest congratulations to Lovlina Borgohain on winning the first ever Gold Medal in the Women’s 75kg weight category boxing event at the Asian Games 2026.
The entire nation is proud of you!#Cheer4Bharat pic.twitter.com/nw3YyeWDX8
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) October 2, 2026
సంబంధిత వార్తలు

India | 44 ఏండ్ల ఆధిపత్యానికి తెర.. రికర్వ్ ఆర్చరీలో ప్రపంచ చాంపియన్‌ను మట్టికరిపించిన భారత్
అక్టోబర్ 2, 2026

Droupadi Murmu | మరిన్ని మైలురాళ్లను చేరుకోవాలి.. ఆర్చరీ జట్టుకు రాష్ట్రపతి అభినందన
సెప్టెంబర్ 30, 2026

Vakiti Srihari | ఆసియా క్రీడల్లో తరుణ్ పతకం తేవడం గర్వకారణం: మంత్రి వాకిటి
సెప్టెంబర్ 27, 2026
తాజావార్తలు
- ●Vladimir Putin | ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపుకు మోదీ వద్ద మంచి ఆలోచనలు ఉన్నాయ్ : పుతిన్
- ●Gold And Silver Prices Today | పసిడికి మళ్లీ పెరుగుతున్న డిమాండ్.. ఒక్క రోజులోనే రూ.10వేలు జంప్..
- ●Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
- ●Movie Review | డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ రివ్యూ - రాజమౌళి కొడుకు సినిమా ఎలా ఉందంటే?
- ●Crude Oil | అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం.. భారీగా పెరిగిన చమురు ధరలు..
- ●Mahatma Gandhi | మహాత్ముడికి ఘన నివాళులు

Vladimir Putin | ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపుకు మోదీ వద్ద మంచి ఆలోచనలు ఉన్నాయ్ : పుతిన్

Gold And Silver Prices Today | పసిడికి మళ్లీ పెరుగుతున్న డిమాండ్.. ఒక్క రోజులోనే రూ.10వేలు జంప్..

Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

Movie Review | డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ రివ్యూ - రాజమౌళి కొడుకు సినిమా ఎలా ఉందంటే?



