KCR | గాంధీజీ అనుసరించిన సత్యాగ్రహ పంథా నేటి యువతరానికి ఆచరణీయం: కేసీఆర్
KCR | మహాత్మా గాంధీ (Mahatma Gandhi) జయంతి పురస్కరించుకుని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలపుతూ, జాతిపితకు నివాళులు అర్పించారు. మహాత్మాగాంధీ అనుసరించిన ప్రజాస్వామిక శాంతియుత పోరాట కార్యాచరణ తెలంగాణ (Telangana) రాష్ట్ర సాధన ఉద్యమంలో తనకు స్పూర్తిగా నిలిచిందని తెలిపారు.
KCR | త్రినేత్ర న్యూస్: మహాత్మా గాంధీ (Mahatma Gandhi) జయంతి పురస్కరించుకుని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలపుతూ, జాతిపితకు నివాళులు అర్పించారు. మహాత్మాగాంధీ అనుసరించిన ప్రజాస్వామిక శాంతియుత పోరాట కార్యాచరణ తెలంగాణ (Telangana) రాష్ట్ర సాధన ఉద్యమంలో తనకు స్పూర్తిగా నిలిచిందని తెలిపారు. ప్రజాస్వామిక హక్కుల సాధనకోసం గాంధీజీ అనుసరించిన సత్యాగ్రహ పంథా నేటి యువతరానికీ ఆచరణీయమన్నారు. గాంధీ జయంతి (Gandhi Jayanti) సందర్భంగా దేశ స్వాతంత్య్రం కోసం వారి త్యాగనిరతని స్మరించుకుంటూ ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించారు.
న్యాయమైన ప్రజల ఆకాంక్షల కోసం, నిరంకుశ ప్రభుత్వాల మీద పోరాడే నాయకత్వం, విశాల దృక్పథంతో తమ పోరాట కార్యాచరణను రూపొందించుకోవాలనే తాత్వికతను గాంధీజీ జీవితం నుంచి నేర్చుకోవాల్సి ఉందన్నారు. పీడితులందరినీ సమన్వయం చేసుకుంటూ, భావజాల వ్యాప్తిని చేస్తూ, శాంతియుత పోరాటంలో భిన్న వర్గాలను ఐక్యసంఘటన శక్తిగా తీర్చిదిద్దుకోవాలనే గాంధీజీ ఆశయాలను ప్రతీవొక్కరు అనుసరించాలన్నారు.
తెలంగాణ సాధన కోసం తాను వొంటరిగా ముందడుగు వేసిన నాటినుంచి నేటి వరకు ఎన్ని కష్టాలొచ్చినా తాను స్థిత ప్రజ్జతతో అనుసరిస్తున్న కార్యాచరణలో గాంధీజీ స్పూర్తి ఇమిడి వున్నదని స్పష్టం చేశారు. విద్వేష పూరిత ప్రసంగాలను, కక్షపూరిత వైఖరులను విడనాడి, ప్రజల నడుమ శాంతి సౌభ్రాతృత్వం పరిఢవిల్లేలా పాలనను కొనసాగించడం ద్వారా మాత్రమే జాతిపిత మహాత్మాగాంధీకి మనం నిజమైన నివాళులు అర్పించిన వారమౌతామని కేసీఆర్ పునరుద్ఘాటించారు.
తాజావార్తలు
- ●Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
- ●Movie Review | డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ రివ్యూ - రాజమౌళి కొడుకు సినిమా ఎలా ఉందంటే?
- ●Lovlina Borgohain | పుట్టినరోజు బహుమతి.. బాక్సింగ్‌లో లవ్లీనా గోల్డ్‌మెడల్
- ●Crude Oil | అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం.. భారీగా పెరిగిన చమురు ధరలు..
- ●Mahatma Gandhi | మహాత్ముడికి ఘన నివాళులు
- ●India | 44 ఏండ్ల ఆధిపత్యానికి తెర.. రికర్వ్ ఆర్చరీలో ప్రపంచ చాంపియన్‌ను మట్టికరిపించిన భారత్

Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

Movie Review | డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ రివ్యూ - రాజమౌళి కొడుకు సినిమా ఎలా ఉందంటే?

Lovlina Borgohain | పుట్టినరోజు బహుమతి.. బాక్సింగ్‌లో లవ్లీనా గోల్డ్‌మెడల్

Crude Oil | అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం.. భారీగా పెరిగిన చమురు ధరలు..





