Kavitha | కొత్త పార్టీ వేళ.. గన్‌పార్క్‌లో అమర వీరులకు నివాళులర్పించిన కవిత
Kavitha | మరికాసేపట్లో తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) నూతన పార్టీని ప్రకటించనున్నారు.
Kavitha | త్రినేత్ర.న్యూస్: మరికాసేపట్లో తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) నూతన పార్టీని ప్రకటించనున్నారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని అధ్వయ ఫంక్షన్ హాల్లో పార్టీ పేరును ప్రకటించడంతోపాటు జండాను ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌లో (Gun park) అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణలో కొత్త విప్లవం రానుందని, తనను ప్రజలు ఆశీర్వదించాలన్నారు.

అంతకుముందు బంజారాహిల్స్‌లోని తన నివాసంలో కవిత దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితు ఆశీర్వాదం తీసుకున్నారు. సర్వమత ప్రార్థనల అనంతరం భర్త, కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం గన్ పార్క్‌కు చేరుకున్నారు. అమరులకు నివాళులు అర్పించిన తర్వాత మునీరాబాద్ బయల్దేరారు. ఉదయం 10 గంటలకు పార్టీ ప్రకటన, జెండా ఆవిష్కరించనున్నారు. సభ అనంతరం ర్యాలీగా లిబర్టీ చౌరస్తాకు వస్తారు. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి ఇంటికి చేరుకుంటారు.
తెలంగాణలో ఆవిర్భవించబోయే కొత్త రాజకీయ శక్తి ప్రారంభానికి ముందు, అమరుల త్యాగాలను స్మరించుకుంటూ గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు నివాళులు అర్పించారు. pic.twitter.com/9Ue1RkosrH
— Telangana Jagruthi (@TJagruthi) April 25, 2026
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



