త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kalvakuntla Kavitha | ఆత్మలేని మర మ‌నిషి కేసీఆర్.. తోడేళ్ల చేతిలో ఖైదీ అయ్యారు : క‌విత‌

Kalvakuntla Kavitha | గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. కేసీఆర్ ఆత్మ లేని మ‌ర మ‌నిషిగా మారార‌ని, గుంట న‌క్క‌లు, తోడేళ్ల చేతిలో ఖైదీ అయ్యార‌ని ఆమె విమ‌ర్శించారు.

S

Telangana | Published On Apr 25, 2026, 6.41 pm IST

Kalvakuntla Kavitha | ఆత్మలేని మర మ‌నిషి కేసీఆర్.. తోడేళ్ల చేతిలో ఖైదీ అయ్యారు : క‌విత‌
Advertisement

Kalvakuntla Kavitha | త్రినేత్ర‌.న్యూస్ : గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. కేసీఆర్ ఆత్మ లేని మ‌ర మ‌నిషిగా మారార‌ని, గుంట న‌క్క‌లు, తోడేళ్ల చేతిలో ఖైదీ అయ్యార‌ని ఆమె విమ‌ర్శించారు. తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ ప్ర‌క‌ట‌న సంద‌ర్భంగా క‌విత ఈ వ్యాఖ్య‌లు చేశారు.

ఆనాటి కేసీఆర్, నేటి కేసీఆర్ వేరు. ఆ నాటి కేసీఆర్ చేనేత కార్మికులు చనిపోతే బిక్షాటన చేసి సాయం చేశా రు. కానీ మారిన, మర మనిషి కేసీఆర్ ఇప్పుడు ప్రజలు కష్టాల్లో ఉన్న బయటకు రావటం లేదు. వెలుగుమట్లలో, హైడ్రా పేరుతో ఇళ్లు కూల్చేస్తుంటే అయ్యా కేసీఆర్ అని ప్రజలు పిలుస్తుంటే కూడా సార్ బయటకు రావ‌డం లేదు. ఎక్కడ ఎవరికీ చిన్న కష్టం వచ్చిన ఆ సార్ బయటకు రారు. ఎందుకంటే ఆయన ఆత్మలేని మర మ‌నిషి. ఆనాడు సింగరేణిలో కార్మికుడు చనిపోతే వెళ్లి పరామర్శించిన ఆయన...నేడు చేవెళ్లలో బస్సు ప్రమాదంలో చాలా మంది చనిపోయిన సరే పట్టించుకోలేదు. అధికారం వచ్చిన తర్వాత ప్రేమ, మమకారం పోయిందా..?

కేసీఆర్ రాజ‌కీయ ప‌రిణతి కోల్పోయారు..

అవినీతి చేస్తే కొడుకునైనా, కూతురినైనా సరే వదలనని కేసీఆర్ గతంలో చెప్పారు. కాళేశ్వరంలో అవినీతి జరుగుతుందని చెబితే ఆ అవినీతి చేసిన పందికొక్కులను పక్కన పెట్టుకొని తననే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. గుంటనక్కలు, తోడేళ్ల చేతుల్లో కేసీఆర్ ఖైదీ అయ్యారు. ఆర్డీఎస్ ద్వారా నీళ్ల కోసం ఆనాడు పాదయాత్ర చేసిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఎందుకు పట్టించుకోలేదు. కేంద్రంతో గొడవ పెట్టుకోకపోయింటే పాలమూరు-రంగారెడ్డి పూర్తయ్యేది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన పదేళ్లలో నీళ్ల కోసం లక్షా 89 వేల కోట్లు ఖర్చు చేసి 14 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లిచ్చారు. రాష్ట్రంలో ఏదో పీకి కట్టలు కట్టారని పంజాబ్, గుజరాత్, బీహార్ వెళ్లి జాతీయ పార్టీ పెట్టాలని చూశారు. పైగా ప్రజలే తప్పు చేశారన్నట్లుగా కేసీఆర్ రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతున్నారు. తాను ఎన్ని మాట్లాడిన సరే బీఆర్ఎస్ నేతలకు సమాధానం చెప్పటం చేతకావటం లేదు. ఇప్పుడు కూడా సమాధానం చెప్పకపోతే ప్రజలే బయట‌కు లాగి సమాధానం చెప్పేలా చేస్తారని క‌విత పేర్కొన్నారు.

Advertisement
Advertisement