త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kalvakuntla Kavitha | టీఆర్ఎస్ పాంచ‌జ‌న్యం.. ఒకే నోటిఫికేష‌న్‌లో 4 ల‌క్ష‌ల ఉద్యోగాలు : క‌విత‌

Kalvakuntla Kavitha | టీఆర్ఎస్ పార్టీ పాంచ‌జ‌న్యం ల‌క్ష్యంగా ప‌ని చేస్తుంద‌ని తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత చెప్పారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, వ్యవసాయం, ఉపాధి, సామాజిక న్యాయం అనే పంచ సూత్రాలే ఇరుసుగా తమ పార్టీ పని చేస్తుందన్నారు.

S

Telangana | Published On Apr 25, 2026, 7.36 pm IST

Kalvakuntla Kavitha | టీఆర్ఎస్ పాంచ‌జ‌న్యం.. ఒకే నోటిఫికేష‌న్‌లో 4 ల‌క్ష‌ల ఉద్యోగాలు : క‌విత‌
Advertisement

Kalvakuntla Kavitha | త్రినేత్ర‌.న్యూస్ : టీఆర్ఎస్ పార్టీ పాంచ‌జ‌న్యం ల‌క్ష్యంగా ప‌ని చేస్తుంద‌ని తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత చెప్పారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, వ్యవసాయం, ఉపాధి, సామాజిక న్యాయం అనే పంచ సూత్రాలే ఇరుసుగా తమ పార్టీ పని చేస్తుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్ర‌క‌టించిన సంద‌ర్భంగా క‌విత మాట్లాడారు.

ఉచిత విద్య

తెలంగాణ రాష్ట్ర సేన అజెండాను కవిత వివరించారు. పాంచజన్యం పేరుతో ఐదు అంశాలపై హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతు సంక్షేమం, ఉపాధి, సామాజిక న్యాయం అనే అంశాలపై దృష్టి పెడతామని ప్రకటించారు. కేజీ నుంచి పీజీ వరకు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో చదివిన కూడా ప్రజలపై రూపాయి భారం పడనివ్వమని చెప్పారు.

ఉచిత వైద్యం

ఎంత పెద్ద ఆరోగ్య సమస్యకైనా కార్పొరేట్ వైద్యం చేయించుకున్న సరే ప్రజలకు ఆ వైద్యాన్ని ఉచితంగానే అందించే బాధ్యత తనదని కవిత స్పష్టం చేశారు.

రైతే రాజు

ఇక రైతు సంక్షేమం అంటే రైతుకు గౌరవం వచ్చేలా కృషి చేయటమేనన్నారు. తాము రైతులమని గర్వంగా చెప్పుకునేలా చేస్తామన్నారు. 24 గంటల ఉచిత కరెంట్, యూరియ సహా రైతు సంక్షేమానికి చేయాల్సివన్నీ చేస్తామని స్పష్టం చేశారు. రైతును రాజు చేయటమే లక్ష్యమన్నారు.

4 ల‌క్ష‌ల ఉద్యోగాలు

ఇక ఉపాధి విషయంలోనూ తమకు స్పష్టమైన విజన్ ఉందని కవిత చెప్పారు. యువతకు ఉపాధి అంటే కేవలం ఉద్యోగం మాత్రమే కాదన్నారు. వారి వద్ద మంచి వ్యాపార ఆలోచన ఉంటే 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు ప్రభుత్వమే రుణం అందించి వారిని ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు. అదే విధంగా తాము అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ఒకటే నోటిఫికేషన్ లో 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారులు తమ యవ్వనాన్ని ఉద్యమంలో కోల్పోయారని చెప్పారు. వారి కోసం జూన్ 2, 2014 ను కటాఫ్ తేదీగా నిర్ణయిస్తూ లక్ష సూపర్ న్యూమరీ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.

సామాజిక న్యాయం

ఇక సామాజిక న్యాయం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తామన్నారు. హిందీలో తియ్యగా మాట్లాడి బీఆర్ఎస్, కాంగ్రెస్ లు మైనార్టీలను మోసం చేశాయని కవిత చెప్పారు. మైనార్టీలతో పాటు అన్ని వర్గాలకు రాజకీయ అధికారం కోసం తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. మహిళ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వటంతో పాటు చిరు ఉద్యోగులు, వ్యాపారులు, కాంట్రాక్టర్లను కడుపులో పెట్టుకొని చూసుకుంటామ‌ని క‌విత పేర్కొన్నారు.

Advertisement
Advertisement