Kalvakuntla Kavitha | బీజేపీ ఎంపీలు బానిసలు.. అందుకే నోరు మెదపడం లేదు : కవిత
Kalvakuntla Kavitha | తెలంగాణ నుంచి గెలుపొందిన 8 మంది బీజేపీ ఎంపీలు ప్రధాని మోదీకి బానిసలుగా మారారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పటికీ నోరు మెదపడం లేదని మండిపడ్డారు.
Kalvakuntla Kavitha | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ నుంచి గెలుపొందిన 8 మంది బీజేపీ ఎంపీలు ప్రధాని మోదీకి బానిసలుగా మారారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పటికీ నోరు మెదపడం లేదని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ ప్రకటన సందర్భంగా బీజేపీపై కవిత నిప్పులు చెరిగారు.
బీజేపీ అంటేనే సామాజిక న్యాయానికి బద్ద వ్యతిరేకి. ఆ పార్టీ పెద్దలకు అసలు తెలంగాణ ఏర్పాటే ఇష్టం లేదు. ఒకరు తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని అంటే మరొక తలకాయ లేని ఎంపీ తెలంగాణ ఏర్పాటును ఇండియా, పాకిస్తాన్ విభజనతో పోల్చారు. తెలంగాణను అవమానించేలా మాట్లాడిన సరే ఇక్కడి బానిస ఎంపీలు నోరు మెదపటం లేదు. తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వకపోయిన సరే ప్రశ్నించటం లేదు.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపారు. పోలవరం కారణంగా భద్రాచలం వద్ద ఐదు గ్రామాలు మునిగిపోయే పరిస్థితి ఉంది. ఆ గ్రామాలను తెలంగాణకు తేవాలి. ఈ అంశంపై జాగృతి పోరాటం చేసింది. కేంద్రానికి, ఆంధ్రా ప్రభుత్వానికి లేఖ రాసింది. బీజేపీ ఎంపీలు 8 మంది తెలంగాణ బిడ్డలైతే రాముని గుడి మునిగిపోకుండా ఐదు గ్రామాలను తెలంగాణకు తేవాలి. మొదటి నుంచి కూడా బీజేపీ సామాజిక న్యాయానికి బద్ద వ్యతిరేకి. మహిళ బిల్లును, కుల గణన, బీసీ బిల్లును తొక్కి పెట్టారు. పేదలకు కూడు పెట్టే ఉపాధి హామీ పథకాన్ని కూడా లేకుండా చేశారని కవిత విమర్శించారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






