త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kalvakuntla Kavitha | మ‌రో రెండేళ్ల‌లో అధికారంలోకి.. అమ్మగా పరిపాలన అందిస్తా : క‌విత‌

Kalvakuntla Kavitha | రెండున్నరేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చి.. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అమ్మ‌గా ప‌రిపాల‌న అందిస్తాన‌ని తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు కల్వ‌కుంట్ల క‌విత అన్నారు.

S

Telangana | Published On Apr 25, 2026, 7.24 pm IST

Kalvakuntla Kavitha | మ‌రో రెండేళ్ల‌లో అధికారంలోకి.. అమ్మగా పరిపాలన అందిస్తా : క‌విత‌
Advertisement

Kalvakuntla Kavitha | త్రినేత్ర‌.న్యూస్ : రెండున్నరేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చి.. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అమ్మ‌గా ప‌రిపాల‌న అందిస్తాన‌ని తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు కల్వ‌కుంట్ల క‌విత అన్నారు. తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ ప్ర‌క‌ట‌న సంద‌ర్భంగా క‌విత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

తెలంగాణలో 3.50 కోట్ల మంది ప్రజలకు అమ్మనై పరిపాలన అందిస్తాను. అమ్మతనంతో పాలన చేస్తేనే బిడ్డల కష్టం తెలుస్తుంది. తెలంగాణలో ఏళ్ల తరబడి నడిచిన భూస్వామ్య వ్యవస్థపై ఎందరో మహానుభవులు పోరాడితేనే సమానత్వం వచ్చింది. మలిదశలో కేసీఆర్, ఉద్యమకారులు పోరాడితే కొత్త రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు తాము రాజకీయ శక్తితో పాటు ప్రజా పోరాటాలను మిళితం చేసి సామాజిక తెలంగాణ సాధిస్తాం. తల్లి జేబు చూడదని, కడుపు చూస్తుంది. కచ్చితంగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా తామే ఉంటామని... మరో రెండేళ్లలో అధికారంలోకి వస్తామని క‌విత‌ ధీమా వ్యక్తం చేశారు.

కాళరాత్రిలో కాగడా మాదిరిగా..

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, సాంస్కృతిక వికాసం కోసం తెలంగాణ జాగృతి అహర్నిశలు పిడికిలి బిగించి కొట్లాడింది. తెలంగాణ సాంస్కృతిక దీపాన్ని తెలంగాణ జాగృతి కార్యకర్తలు పదిలంగా కాపాడుకున్నారు. కాళరాత్రిలో కాగడా మాదిరిగా తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ జాగృతి వెలుగునిచ్చింది. బతుకమ్మ పండుగ ద్వారా తెలంగాణ సంస్కృతి ఇది అని ప్రపంచానికి జాగృతి చాటిచెప్పింది. ఐతే ఏ లక్ష్యం కోసం తెలంగాణ సాధించుకున్నామో ఆ లక్ష్యాలు నేరవేరలేదు. తెలంగాణ భవిష్యత్ ను రాసుకోవటానికి తాను కొత్త పార్టీతో ముందుకు వచ్చాను. తన జీవితంలో ఇది మరుపురాని రోజు అని క‌విత ఉద్వేగానికి లోన‌య్యారు.

Advertisement
Advertisement