త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | కాళేశ్వ‌రం ప్రాజెక్టును వ‌దిలేసే ప‌రిస్థితి లేదు.. సీఎం రేవంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..!

CM Revanth Reddy | కాళేశ్వ‌రం ప్రాజెక్టును గాలికి వ‌దిలేసే ప‌రిస్థితి లేద‌ని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మేడిగ‌డ్డ బ‌రాజ్‌ను ప‌రిశీలించిన అనంత‌రం ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై కాంగ్రెస్ అధికారంలో వ‌చ్చాక విచార‌ణ‌కు జ్యుడీషియ‌ల్ క‌మిష‌న్ వేశామ‌ని, పీసీ ఘోష్ 645 పేజీలతో స‌వివ‌రంగా నివేదిక ఇచ్చార‌న్నారు.

P

Telangana | Published On Apr 20, 2026, 8.13 pm IST

CM Revanth Reddy | కాళేశ్వ‌రం ప్రాజెక్టును వ‌దిలేసే ప‌రిస్థితి లేదు.. సీఎం రేవంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..!
Advertisement

CM Revanth Reddy | కాళేశ్వ‌రం ప్రాజెక్టును గాలికి వ‌దిలేసే ప‌రిస్థితి లేద‌ని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మేడిగ‌డ్డ బ‌రాజ్‌ను ప‌రిశీలించిన అనంత‌రం ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై కాంగ్రెస్ అధికారంలో వ‌చ్చాక విచార‌ణ‌కు జ్యుడీషియ‌ల్ క‌మిష‌న్ వేశామ‌ని, పీసీ ఘోష్ 645 పేజీలతో స‌వివ‌రంగా నివేదిక ఇచ్చార‌న్నారు. ప్ర‌భుత్వం, ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్స్ చేసిన త‌ప్పులు, నిర్మాణ సంస్థ చేసిన త‌ప్పులు, ఇందులో అంచ‌నాలు పెంచి ఎలా దోచుకున్నారో సంపూర్ణంగా నివేదిక ఇచ్చార‌ని, చంద్ర‌శేఖ‌ర్‌రావు, హ‌రీశ్‌రావు, 119 మంది అధికారులు, ప్ర‌తినిధులంద‌రినీ విచారించ‌డంతో వివ‌ర‌ణ ఇచ్చుకునేందుకు అవ‌కాశం ఇచ్చి నివేదిక ఇచ్చిన‌ట్లు తెలిపారు.

పీసీ ఘోష్‌తో విచార‌ణ చేయించాం..

ఆ నివేదిక‌పై అసెంబ్లీలో చ‌ర్చ జ‌రిపి కేంద్రానికి మ‌ల్టి ఏజెన్సీస్‌, మ‌ల్టిస్టేట్స్ ఇష్యూలు, ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూట్ ఇన్వాల్‌మెంట్ ఉంది. ఒక రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌రిధిలో ఉండే విచార‌ణ సంస్థ‌లు విచార‌ణ చేస్తే సంపూర్ణ విచార‌ణ జ‌ర‌గ‌ద‌ని శాస‌న‌స‌భ‌లో సుదీర్ఘ చ‌ర్చ చేసి ప్ర‌తిప‌క్షాల‌కు అంద‌రికీ అవ‌కాశం ఇచ్చి ప్ర‌భుత్వం సీబీఐ విచార‌ణ చేయాల‌ని, బాధ్యుల‌ను శిక్షించాల‌ని పంపించామ‌న్నారు. ఇప్ప‌టికే దాదాపు ఎనిమిది నెల‌లు దాటి తొమ్మిది నెల‌లు కావొస్తుంద‌ని, కేంద్రం ఇప్ప‌టి వ‌ర‌కు సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించ‌లేద‌ని ఆరోపించారు. గ‌తంలో కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి మీ వ‌ల్ల కాదు మీరు చేయ‌రు.. మీకు విచార‌ణ చేసే సామ‌ర్థ్యం లేదు, సీబీఐకి ఇస్తే 48 గంట‌ల్లో కేసీఆర్‌, హ‌రీశ్‌రావును జైల్లో పెడామ‌ని, కేసును సీబీఐకి ఇవ్వాల‌ని కేంద్ర‌మంత్రిగా డిమాండ్ చేశార‌ని గుర్తు చేశారు.

సీబీఐ విచార‌ణ‌కు ఆదేశిస్తే స్పందించ‌డం లేదు

దాదాపు తొమ్మిది నెల‌లు కావొస్తున్న కేంద్ర ప్ర‌భుత్వం స్పందించ‌క‌పోవడం లేద‌ని, ఈ మ‌ధ్య‌కాలంలో మ‌ళ్లీ విచార‌ణ త‌క్ష‌ణం చేప‌ట్టాల‌ని లేఖ రాశామ‌న్నారు. ఇందులో ఎవ‌రెవ‌రూ త‌ప్పిదాల‌కు పాల్ప‌డ్డారో.. వారిని శిక్షించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అధికారులు రిటైర్ అయిపోతున్న‌ర‌ని, కొంద‌రు ర‌క‌ర‌కాల ప‌రిస్థితుల వ‌ల్ల త‌ప్పించుకునే ప‌రిస్థితి ఉందంటూ లేఖ రాశామ‌న్నారు. ఈ నేప‌థ్యంలో విచార‌ణ చేసి ఇందులో ఉన్న వారిని శిక్షించ‌డం ఒక కోణ‌మైతే.. ప్రాజెక్టులో రూ.ల‌క్ష కోట్లు కాంట్రాక్టుల‌కు చెల్లించార‌న్నారు. రూ.ల‌క్ష కోట్లు ఖ‌ర్చు చేసి కాళేశ్వ‌రం ప్రాజెక్టుతో ల‌క్ష ఎక‌రాల‌కు నీరు ఇవ్వ‌లేక‌పోయామ‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 2019లో ప్రారంభించిన ప్రాజెక్టుతో నీరు ఇవ్వ‌లేక‌పోమ‌ని, 2023 వ‌ర‌కు 162 టీఎంసీల‌ను మాత్ర‌మే లిఫ్ట్ చేయ‌డం జ‌రిగింద‌న్నారు. 20 టీఎంసీలు ఆవిర‌య్యాయ‌ని, 30 టీఎంసీలు శ్రీ‌పాద ఎల్లంప‌ల్లి నుంచి మ‌ళ్లీ స‌ముద్రంలోకే వ‌ద‌లాల్సిన ప‌రిస్థితి నెల‌కొంద‌న్నారు.

ల‌క్ష ఎక‌రాల‌కు కూడా నీరివ్వ‌లేక‌పోయాం..

కాళేశ్వ‌రంపై రూ.ల‌క్ష కోట్లు ఖ‌ర్చు చేస్తే ఇప్ప‌టి వ‌ర‌కు నిక‌రంగా ల‌క్ష ఎక‌రాల‌కు నీరివ్వ‌లేక‌పోయామ‌ని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అట్ల‌ని రూ.ల‌క్ష కోట్లు ఖ‌ర్చు చేసిన ప్రాజెక్టును గాలికి వ‌దిలేసే ప‌రిస్థితి లేదని, వ‌దిలేస్తే ఒక భార‌మ‌ని, పున‌ర్నిర్మిస్తే ఒక భార‌మ‌న్నారు. కానీ, ఇందులోనే అన్ని చ‌ర్చ‌లు చేసి అన్నింటిని రిపేర్ చేసి ఈ తెలంగాణ ప్రాంతానికి అవ‌స‌ర‌మైన ప‌నులు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు. నెల రోజుల‌కు ముందే స‌మావేశం నిర్ణ‌యించామ‌ని, ఇక్క‌డ‌కు వ‌చ్చి చ‌ర్చిస్తే బండారం బ‌య‌ట‌ప‌డుతుంది.. దోపిడీ ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌వుతుంద‌ని, సాంకేతిక నిపుణులు ప‌ర్య‌టించాక లోపాల‌ను గుర్తిస్తార‌ని.. ఇదేరోజు రాజ‌కీయ పార్టీ మీటింగ్ పెట్టార‌ని ఆరోపించారు. ఈ రోజు సాంకేతిక నిపుణులు అంద‌రూ వ‌చ్చార‌ని, ఇది పొలిటిక‌ల్ విజిట్ కాదు ఎక్స్‌ప‌ర్ట్స్ విజిట్ అని తెలిపారు. త‌మ ప్రోగ్రామ్ గురించి తెలిసి అతితెలివితేట‌ల‌తో ఆ ప‌క్క‌న మీటింగ్ పెట్టుకున్నార‌ని, స‌భ పెట్టుకున్నా అనుమ‌తి ఇచ్చామ‌ని చెప్పారు. మీరు ఏం పెట్టుకున్నా నిజాలు ప్ర‌జ‌ల‌కు తెలుస్తాయ‌ని.. ఇప్పుడు మాపై ఎదురుదాడి చేస్తున్నార‌ని సీఎం రేవంత్ విమ‌ర్శించారు.

Advertisement
Advertisement