Asian Games | 44 ఏళ్ల నిరీక్షణకు తెర..! ఆసియా కప్ వుమెన్స్ హాకీలో భారత్‌కు స్వర్ణం
Asian Games | ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. 44 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. ఫైనల్‌లో చైనాపై 1–0తో విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభంలోనే లభించిన ఆధిక్యాన్ని చివరి వరకు కాపాడుకున్న భారత్.. అద్భుతమైన రక్షణతో చైనా ఎటాక్‌ను సమర్థంగా అడ్డుకుంది. ఈ విజయంతో 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు కూడా భారత జట్టు అర్హత సాధించింది.
- చైనాపై 1–0తో విజయం..
- 1982 తర్వాత తొలిసారి గోల్డ్ మెడల్
- లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు అర్హత
- కీలక గోల్ కొట్టిన లాల్‌రెమ్సియామి
Asian Games | ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. 44 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. ఫైనల్‌లో చైనాపై 1–0తో విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభంలోనే లభించిన ఆధిక్యాన్ని చివరి వరకు కాపాడుకున్న భారత్.. అద్భుతమైన రక్షణతో చైనా ఎటాక్‌ను సమర్థంగా అడ్డుకుంది. ఈ విజయంతో 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు కూడా భారత జట్టు అర్హత సాధించింది.
లాల్‌రెమ్సియామి గోల్‌తోనే..

మ్యాచ్ ఆరంభం నుంచే భారత్ చైనాపై ఒత్తిడి పెంచింది. ఆరో నిమిషంలో బాల్‌జీత్ కౌర్‌కు గ్రీన్ కార్డు లభించినప్పటికీ భారత జట్టు వెనక్కి తగ్గలేదు. పదో నిమిషంలో లాల్‌రెమ్సియామి ఫీల్డ్ గోల్‌తో భారత్‌ను 1–0 ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. తన 200వ అంతర్జాతీయ మ్యాచ్‌లోనే కీలక గోల్ చేయడం విశేషం. ఆ తర్వాత భారత్‌కు పెనాల్టీ కార్నర్ లభించినా దాన్ని గోల్‌గా మలచలేకపోయింది. అయినా తొలి క్వార్టర్ ముగిసే వరకు 1–0 ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది.
కాపాడిన సవిత..
రెండో క్వార్టర్‌లో చైనా దూకుడు పెంచింది. వరుస ఎటాకింగ్‌తో భారత గోల్‌పోస్ట్‌పై ఒత్తిడి పెంచింది. ఈ క్రమంలో చైనాకు పెనాల్టీ స్ట్రోక్ దక్కింది. స్కోరు సమం చేసేందుకు వచ్చిన ఈ కీలక అవకాశాన్ని భారత గోల్‌కీపర్ సవిత పూనియా అద్భుతంగా అడ్డుకుంది. చైనా ఎటాకింగ్ కొనసాగించినా టీమిండియా డిఫెన్స్ అడ్డుగోడలా నిలిచింది. ప్రత్యర్థి ఆటగాళ్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా భారత డిఫెన్స్ సమర్థంగా అడ్డుకుంది. 28వ నిమిషంలో చైనా క్రీడాకారిణి వెన్ డాన్‌కు గ్రీన్ కార్డు లభించింది. హాఫ్‌టైమ్‌కు భారత్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది.

చివరి వరకు అదే ఉత్కంఠ
రెండో అర్ధభాగంలోనూ చైనా గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించింది. భారత్ మాత్రం ఆధిక్యాన్ని కాపాడుకోవడంపై దృష్టి పెట్టింది. భారత ప్లేయర్లు చైనా ప్రతి దాడినీ తిప్పికొట్టారు. చివరి నిమిషాల్లో చైనా గోల్‌కీపర్‌ను బయటకు పంపి అదనపు ఆటగాడితో దాడికి దిగింది. అయినప్పటికీ ఆ వ్యూహం ఫలించలేదు. భారత్ రక్షణతో పాటు అవసరమైన సందర్భాల్లో దూకుడుగా ఆడుతూ చైనాకు సమం చేసే అవకాశం ఇవ్వలేదు. తుది విజిల్ మోగగానే భారత శిబిరంలో సంబరాలు మిన్నంటాయి.
1982 తర్వాత మళ్లీ గోల్డ్..
ఆసియా క్రీడల్లో మహిళల హాకీ తొలిసారి 1982లో చేర్చగా.. ఢిల్లీలో జరిగిన ఆ క్రీడల్లో భారత్ స్వర్ణం సాధించింది. ఆ తర్వాత 1998, 2018లో ఫైనల్‌కు చేరినా రజతంతో సరిపెట్టుకుంది. 1998లో దక్షిణ కొరియా చేతిలో, 2018లో జపాన్ చేతిలో భారత్ ఓటమి పాలైంది. ఈసారి కెప్టెన్ సలీమా టెతే నేతృత్వంలోని భారత జట్టు ఆ అవకాశాన్ని చేజారనివ్వలేదు. టోర్నీలో అజేయంగా నిలిచి చివరకు స్వర్ణాన్ని ముద్దాడింది.

మ్యాచ్ గంట ఆలస్యంగా..
భారత్–చైనా మహిళల హాకీ ఫైనల్ నిర్ణీత సమయం కంటే గంట ఆలస్యంగా ప్రారంభమైంది. జట్టు బస్సులు మార్గమధ్యంలో ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో ఆటగాళ్లు స్టేడియానికి ఆలస్యంగా చేరుకున్నారు. రహదారిపై జరిగిన ప్రమాదం కారణంగా ట్రాఫిక్ నిలిచిపోయినట్లు ఓ అధికారి తెలిపారు. దీంతో మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ 4.30 గంటలకు మొదలైంది. భారత్, చైనా మధ్య ఇప్పటివరకు 29 మ్యాచ్‌లు జరగగా.. ఇరు జట్లు చెరో 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. మరో ఐదు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Asian Games 2026 | ఆసియా క్రీడల్లో బాక్సింగ్‌లో భారత్ గోల్డెన్ హ్యాట్రిక్.. అంకుశ్ పంచ్ అదుర్స్!
అక్టోబర్ 2, 2026

India-Pakistan Border | సరిహద్దులో కాల్పుల కలకలం.. ఇద్దరు చొరబాటుదారులు హతం
అక్టోబర్ 2, 2026

Yuzvendra Chahal | చాహల్ సంచలనం.. ఆ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన లెగ్ స్పిన్నర్..!
అక్టోబర్ 2, 2026
తాజావార్తలు
- ●BMS Nanda Kishore | ఆటో డ్రైవర్లూ.. కనీస ఛార్జీ రూ.50 వసూలు చేయండి: బీఎంఎస్ పిలుపు
- ●OTT Releases | ఈ వారం ఓటీటీలో రిలీజైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే - మలయాళం మూవీ హైలైట్
- ●Jio Platforms IPO | ఇన్వెస్టర్లకు పండుగే.. రూ.37వేల కోట్ల జియో ఐపీవో.. రంగం సిద్ధం..
- ●Students Protest Against Dipke | నీట్ అంశంపై ఎందుకు మౌనంగా ఉన్నారు..? అభిజీత్ దిప్కేకి వ్యతిరేకంగా విద్యార్థుల నిరసన
- ●Auto charges | ఆటో ప్రయాణికులకు షాక్.. చార్జీల పెంపు.. కనీస చార్జ్ ఎంతంటే
- ●Asian Games 2026 | ఆసియా క్రీడల్లో బాక్సింగ్‌లో భారత్ గోల్డెన్ హ్యాట్రిక్.. అంకుశ్ పంచ్ అదుర్స్!

BMS Nanda Kishore | ఆటో డ్రైవర్లూ.. కనీస ఛార్జీ రూ.50 వసూలు చేయండి: బీఎంఎస్ పిలుపు

OTT Releases | ఈ వారం ఓటీటీలో రిలీజైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే - మలయాళం మూవీ హైలైట్

Jio Platforms IPO | ఇన్వెస్టర్లకు పండుగే.. రూ.37వేల కోట్ల జియో ఐపీవో.. రంగం సిద్ధం..

Students Protest Against Dipke | నీట్ అంశంపై ఎందుకు మౌనంగా ఉన్నారు..? అభిజీత్ దిప్కేకి వ్యతిరేకంగా విద్యార్థుల నిరసన



