త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IED Blast | క‌ర్రెగుట్ట‌ల్లో పేలిన ఐఈడీ.. జ‌వాన్‌కు గాయాలు..!

IED Blast | తెలంగాణ - ఛ‌త్తీస్‌గ‌ఢ్ స‌రిహ‌ద్దుల్లోని క‌ర్రెగుట్ట‌ల్లో మావోయిస్టుల కోసం భ‌ద్ర‌తా బ‌ల‌గాలు కూంబింగ్ కొన‌సాగిస్తున్న విష‌యం తెలిసిందే. క‌ర్రెగుట్ట‌ల్లోని పామునూరు, జెల్లా గ్రామాల స‌మీపంలో 39వ బెటాలియ‌న్ సీఆర్పీఎఫ్ బృందాలు శుక్ర‌వారం కూబింగ్ నిర్వ‌హిస్తుండ‌గా.. ఐఈడీ పేలిపోయింది.

S

Telangana | Published On Feb 20, 2026, 7.42 pm IST

IED Blast | క‌ర్రెగుట్ట‌ల్లో పేలిన ఐఈడీ.. జ‌వాన్‌కు గాయాలు..!
Advertisement

IED Blast | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ - ఛ‌త్తీస్‌గ‌ఢ్ స‌రిహ‌ద్దుల్లోని క‌ర్రెగుట్ట‌ల్లో మావోయిస్టుల కోసం భ‌ద్ర‌తా బ‌ల‌గాలు కూంబింగ్ కొన‌సాగిస్తున్న విష‌యం తెలిసిందే. క‌ర్రెగుట్ట‌ల్లోని పామునూరు, జెల్లా గ్రామాల స‌మీపంలో 39వ బెటాలియ‌న్ సీఆర్పీఎఫ్ బృందాలు శుక్ర‌వారం కూబింగ్ నిర్వ‌హిస్తుండ‌గా.. ఐఈడీ పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి న‌వ‌జీత్ అనే జ‌వాన్‌కు తీవ్ర గాయాలైన‌ట్లు తెలిసింది.

కాగా శుక్రవారం ఉదయం పామునూరు నుండి జెల్లా గ్రామానికి రోడ్డు వేసే క్రమంలో సీఆర్పీఎఫ్‌ బృందాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ మార్గంలో 11 ఐఈడీల‌ను గుర్తించి నిర్వీర్యం చేసిన‌ట్లు స‌మాచారం. 12వ ఐఈడీని నిర్వీర్యం చేసే క్ర‌మంలో అది ప్ర‌మాద‌వ‌శాత్తు పేలిపోయింది. దీంతో జ‌వాన్‌కు గాయాలైన‌ట్లు స‌మాచారం. గాయాల‌పాలైన జ‌వాన్‌ను వెంక‌టాపురం త‌ర‌లించి.. మెరుగైన వైద్యం కోసం హైద‌రాబాద్ త‌ర‌లించిన‌ట్లు తెలిసింది.

Advertisement
Advertisement