త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Janwada Farmhouse | జన్వాడ ఫామ్‌హౌస్ నాదే.. కేటీఆర్‌కు సంబంధం లేద‌న్న ఓన‌ర్‌

Janwada Farmhouse | జన్వాడ ఫామ్‌హౌస్ భూములపై జరుగుతున్న ప్రచారంపై యజమాని ప్రదీప్‌ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఫామ్‌హౌస్ ఉన్న భూమి తన సొంతమని, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఆ భూమితో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. తనకు కేటీఆర్‌ చిన్నప్పటి నుంచే స్నేహితుడని, తన ప్రాపర్టీని ఆయనకు లీజ్‌కు ఇచ్చినట్లు వెల్లడించారు.

P

Telangana | Published On Sep 18, 2026, 7.50 pm IST

Janwada Farmhouse | జన్వాడ ఫామ్‌హౌస్ నాదే.. కేటీఆర్‌కు సంబంధం లేద‌న్న ఓన‌ర్‌
Advertisement

Janwada Farmhouse | జన్వాడ ఫామ్‌హౌస్ భూములపై జరుగుతున్న ప్రచారంపై యజమాని ప్రదీప్‌ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఫామ్‌హౌస్ ఉన్న భూమి తన సొంతమని, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఆ భూమితో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. తనకు కేటీఆర్‌ చిన్నప్పటి నుంచే స్నేహితుడని, తన ప్రాపర్టీని ఆయనకు లీజ్‌కు ఇచ్చినట్లు వెల్లడించారు. రాజకీయ పార్టీల నేతలు ఫామ్‌హౌస్‌ను పరిశీలించేందుకు వస్తారన్న ప్రచారంపై ప్రదీప్‌ రెడ్డి స్పందిస్తూ.. ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు ఏవైనా అనుమానాలు ఉంటే తనకు నోటీసులు ఇచ్చి వివరణ కోరవచ్చన్నారు.

భూములకు సంబంధించి ఎలాంటి వివాదాలు లేవని, లీగల్‌గా క్లియర్‌ టైటిల్‌ ఉందని పేర్కొన్నారు. అధికారులు ఏవైనా వివరాలు, పత్రాలు కోరితే చట్టపరమైన విధానంలో సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. అయితే, రాజకీయ పార్టీల నేతలు వ్యక్తిగత ఆస్తిని పరిశీలిస్తామంటూ రాజకీయ వివాదం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. “జన్వాడ ఫార్మ్‌హౌస్‌ భూమి నా సొంతం. కేటీఆర్‌ నా చిన్ననాటి స్నేహితుడు. నా ప్రాపర్టీని ఆయనకు లీజ్‌కు ఇచ్చాను. ప్రభుత్వానికి ఏమైనా సందేహాలుంటే నన్ను సంప్రదించవచ్చు లేదా నోటీసులు ఇవ్వవచ్చు. చట్టపరమైన ప్రక్రియకు పూర్తిగా సహకరిస్తా” అని ప్రదీప్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement
Advertisement