త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jagityal Jaitra Yatra | జ‌గిత్యాల జైత్ర‌యాత్ర‌.. నేప‌థ్యం ఇదీ..

Jagityal Jaitra Yatra | జ‌గిత్యాల జైత్ర‌యాత్ర‌.. ఇది ఉత్త‌ర తెలంగాణ‌లో బ‌హుజ‌న వ‌ర్గాలు నిర్వ‌హించిన అతిపెద్ద ఉద్య‌మం. ఉద్య‌మాల చ‌రిత్ర‌లోనూ జ‌గిత్యాల జైత్ర‌యాత్ర‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌కు ప్ర‌శ్నించే త‌త్వాన్ని, స్వేచ్ఛ వాయువుల‌ను పీల్చుకునే అవ‌కాశం క‌ల్పించింది.

S

Telangana | Published On Apr 19, 2026, 7.20 pm IST

Jagityal Jaitra Yatra | జ‌గిత్యాల జైత్ర‌యాత్ర‌.. నేప‌థ్యం ఇదీ..
Advertisement

Jagityal Jaitra Yatra | త్రినేత్ర‌.న్యూస్ : జ‌గిత్యాల జైత్ర‌యాత్ర‌.. ఇది ఉత్త‌ర తెలంగాణ‌లో బ‌హుజ‌న వ‌ర్గాలు నిర్వ‌హించిన అతిపెద్ద ఉద్య‌మం. ఉద్య‌మాల చ‌రిత్ర‌లోనూ జ‌గిత్యాల జైత్ర‌యాత్ర‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌కు ప్ర‌శ్నించే త‌త్వాన్ని, స్వేచ్ఛ వాయువుల‌ను పీల్చుకునే అవ‌కాశం క‌ల్పించింది. ద‌శాబ్దాలుగా బ‌హుజ‌నుల‌, అణ‌గారిన వ‌ర్గాల ఆవేద‌న‌, ఆక్రంద‌న‌, ఆవేశం నుంచి అగ్నిప‌ర్వ‌త విస్ఫోటంలా ఉవ్వెత్తున ఎగిసిప‌డిన ఉద్య‌మ కెర‌టాల స్ఫూర్తి నాడు, నేడు ఎన్నో బ‌హుజ‌న వ‌ర్గాల‌కు ఊపిరి పీల్చుకునేందుకు స్వేచ్ఛ‌నిచ్చింది.

జ‌గిత్యాల జైత్ర‌యాత్ర నేప‌థ్యం ఇదీ..

నాటి భూస్వాములు.. బ‌హుజ‌న వ‌ర్గాల‌పై దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డేవారు. వారి దాష్టీకాన్ని, ఆగ‌డాల‌ను ప్ర‌శ్నించినా.. కుల‌సంఘాల్లో చ‌ర్చించుకున్నా.. న‌డి బ‌జార్‌లో ప్ర‌జ‌ల ముందు క‌ఠినంగా శిక్షించేవారు. దీంతో ఎవ‌రూ కూడా ప్ర‌శ్నించే సాహ‌సం చేయ‌లేని దుస్థితి. ఒక‌వేళ ప్ర‌శ్నించినా గ్రామాల నుంచి వెలివేసేవారు.. వారి సామాజిక వ‌ర్గాల‌తోనే కుల బ‌హిష్క‌ర‌ణ చేయించేవారు. దీనికి తోడు ఏండ్ల కొద్ది రాత్రి ప‌గ‌లు అనే తేడా లేకుండా వెట్టి చాకిరీ చేయించుకునేవారు... వారి ఇళ్ల‌ల్లో క‌ట్టుబానిస‌లుగా న‌లిగిపోయేవారు.

ఈ క్ర‌మంలోనే వామ‌ప‌క్ష భావ‌జాలం ప‌ల్లెల‌కు వ్యాపించింది. ఇదే అవకాశంగా ఆయా గ్రామాలలో రైతుల‌ను, కూలీల‌ను, యువ‌కుల‌ను చైతన్య పరుస్తూ గ్రామ, గ్రామాన రైతు కూలీ సంఘాలు ఏర్పాటు చేశారు. కుల వృత్తుల వారు, తమ డిమాండ్ల సాధన కోసం ఐక్యంగా ఉండేవారు. పరిసర గ్రామంలో రైతు కూలీ సంఘం ఏర్పడింది అని తెలియడంతో, ఇదే స్ఫూర్తితో ఉత్తర తెలంగాణ జిల్లాలలో గ్రామ, గ్రామాన రైతు కూలీ సంఘాలు ఆవిర్భవించాయి. భూస్వాముల‌కు వ్య‌తిరేకంగా విస్తృత ప్రచారం ద్వారా సుమారు 80 వేలమంది రైతు కూలీలను జగిత్యాల సభకు సమీకరించారు. 1978 సెప్టెంబర్ తొమ్మిదో తేదీన రైతు కూలీ శక్తి ప్రదర్శన పేరుతో భారీ కార్యక్రమం నిర్వహించారు. ఆ రోజు జగిత్యాల నలు వైపులా ఎటు చూసినా జన తరంగం పోటెత్తింది. రైతు కూలీల నినాదాలతో దిక్కులు పిక్కటిల్లాయి. మొత్తంగా జగిత్యాల దద్దరిల్లింది. ఈ భారీ స‌భ జ‌గిత్యాల జైత్ర‌యాత్ర‌గా ఉద్యమాల చరిత్రలో నిలిచిపోయింది.

Advertisement
Advertisement