Jagadeesh Reddy | కాంగ్రెస్ మేనిఫెస్టో ఒక చెత్తబుట్ట.. ప్రజలకు పనికొచ్చేది కాదది
Jagadeesh Reddy | కాంగ్రెస్ మేనిఫెస్టో ఒక చెత్తబుట్ట అని.. ప్రజలకు అవి ఎందుకు పనికి రావని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి (Jagadeesh Reddy) విమర్శించారు.
- అభయ హస్తం భస్మాసుర హస్తమైంది.. అందుకే చెత్తబుట్టల ఏస్తున్నం
- కృష్ణా నీళ్లు తరలించారనేది నూటికి నూరు పాళ్లు నిజం
- కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్
Jagadeesh Reddy | త్రినేత్ర న్యూస్: కాంగ్రెస్ మేనిఫెస్టో ఒక చెత్తబుట్ట అని.. ప్రజలకు అవి ఎందుకు పనికి రావని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి (Jagadeesh Reddy) విమర్శించారు. మూడేళ్ల క్రితం ఇదే నవంబర్ 17న కాంగ్రెస్ మేనిఫెస్టో (Manifesto)ను విడుదల చేసి తెలంగాణకు బ్లాక్ డే గా మార్చారని ఆరోపించారు. ఇంకా స్వర్గమే ఇక్కడికి తెస్తామన్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్ఎస్ నేతలతో కలిసి కాంగ్రెస్ పార్టీ అభయ హస్తం మేనిఫెస్టో ప్రతులను చింపి చెత్తబుట్టలో వేసి వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ సాధారణ ఎన్నికలకు ముందు కేసీఆర్ చేసిన వాటి కన్నా రెండింతలు, మూడింతలు ఎక్కువ చేస్తామని చెప్పారు. స్వర్గమే ఇక్కడికి తెస్తామన్నారు. 420 హామీలు, గ్యారంటీలు, డిక్లరేషన్లతో కాంగ్రెస్ జాతీయ నాయకులు ప్రజలను మభ్యపెట్టారు. రైతులను, యువతను, బీసీ, ఎస్సీ, ఎస్టీలను, మైనారిటీలను డిక్లరేషన్లతో మోసం చేశారు. అఫిడవిట్లు, బాండ్ పేపర్లు ఇచ్చి మరీ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. తులం బంగారం ఇస్తామని ఫించన్ల మొత్తం పెంచుతామని ఎన్నికల సభల్లో ఊదరగొట్టారు.
ప్రజలు చిత్తు కాగితాల్లా చూస్తున్నరు
ఆటో డ్రైవర్లను, విద్యార్థులను రకరకాల హామీలతో మోసం చేశారు. కాలేజీలకు వెళ్లే విద్యార్థినిలకు స్కూటీలు ఇస్తామని చెప్పారు. రైతు రుణమాఫీ, రైతు బంధుపై మోసం చేశారు. ప్రజల ఆశలు నిరాశలు అయ్యాయి. కలలు కల్లలు అయ్యాయి. కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజలు చిత్తు కాగితాల్లాగా చూస్తున్నారు. ఇంత చెత్త పాలనను గతంలో ఎన్నడూ చూడలేదని ప్రజలు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల గొంతు కోసింది. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తున్నారు.
కేసీఆర్ ఇచ్చిన కరెంటు, నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయాల్సిందే. మూడేళ్ల క్రితం ఇదే రోజు నవంబర్ 17న కాంగ్రెస్ మేనిఫెస్టో ను విడుదల చేశారు. మంత్రులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. హైదరాబాద్‌కు మంచి నీటి సమస్య లేదని ఒకడు.. పంటలు వేసుకోవద్దని ఇంకొకడు మాట్లాడుతారు. భస్మాసుర హస్తంగా మారిన కాంగ్రెస్ మేనిఫెస్టోను చింపి చెత్తబుట్టలో వేస్తున్నాం.
ఉత్తమ్‌కు ఒక్కడికే అట్లనిపిస్తుందేమో
కేసీఆర్ మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. డబ్బుల సంపాదనే కాంగ్రెస్ కు ముఖ్యమైంది. కాంగ్రెస్ భూ స్థాపితం కావడం ఖాయం. సమ్మకు సారక్క బ్యారేజ్ కు అనుమతి కోసం సీఎం రేవంత్, ఉత్తమ్ ఇపుడు ఛత్తీస్‌ఘడ్ కు వెళ్తున్నారు. కేసీఆర్ మళ్ళీ సీఎం అయివుంటే ఇప్పటికే ప్రాజెక్టులకు అనుమతి వచ్చి ఉండేది. ఉత్తమ్ కు ఒక్కడికే హైదరాబాద్‌లో నీళ్ల కొరత లేదని అనిపిస్తున్నట్టుంది. ప్రజల దగ్గరికి వెళితే తెలుస్తుంది. చంద్రబాబుకు దక్షిణగా గోదావరి కృష్ణా జలాలు తరలించారనేది నూటికి నూరు పాళ్లు నిజం అని జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు.
తాజావార్తలు
- ●Rukmini Vasanth | ఎన్టీఆర్ డ్రాగన్ సెట్స్‌లో రుక్మిణి వసంత్
- ●Rahul Gandhi | ప్రజాస్వామ్యానికి చరమగీతం పాడేందుకే 850 సీట్ల ప్రతిపాదన
- ●Ar Rahman | మ్యూజిక్ నచ్చలేదని నిర్మాత రెమ్యూనరేషన్ ఇవ్వలేదు - రణబీర్‌కపూర్ సినిమాపై ఏఆర్ రెహమాన్ కామెంట్స్
- ●V Srinivas Goud | ఓబీసీ కుల గణనకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో తీర్మానాలు చేయాలి
- ●Tata Sons | టాటా గ్రూప్ వివాదం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన టాటా సన్స్
- ●High Court | బావర్చి హోటల్ ఘటనలో బీఆర్ఎస్ నేతలకు భారీ ఊరట.. అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు

Rukmini Vasanth | ఎన్టీఆర్ డ్రాగన్ సెట్స్‌లో రుక్మిణి వసంత్

Rahul Gandhi | ప్రజాస్వామ్యానికి చరమగీతం పాడేందుకే 850 సీట్ల ప్రతిపాదన

Ar Rahman | మ్యూజిక్ నచ్చలేదని నిర్మాత రెమ్యూనరేషన్ ఇవ్వలేదు - రణబీర్‌కపూర్ సినిమాపై ఏఆర్ రెహమాన్ కామెంట్స్

V Srinivas Goud | ఓబీసీ కుల గణనకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో తీర్మానాలు చేయాలి





