త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Etala Rajendar | కాంగ్రెస్‌లో రేవంత్ ఉడుం లెక్క చొర్రిండట‌.. వాళ్ల కార్య‌క‌ర్త‌లే ఆయ‌న‌పై కోపంగున్న‌రు

Etala Rajendar | కాంగ్రెస్ పార్టీలో రేవంత్‌రెడ్డి ఉడుం లెక్క చొర్రిండని.. వాళ్ల కార్య‌క‌ర్త‌లే ఆయ‌న‌పై కోపంతో ర‌గిలిపోతున్న‌ర‌ని మ‌ల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ విమ‌ర్శించారు. ఫీజులు ఇచ్చేదాక వ‌దిలే ప్ర‌స‌క్తే లేద‌న్నారు.

S

Telangana | Published On Aug 25, 2026, 7.30 pm IST

Etala Rajendar | కాంగ్రెస్‌లో రేవంత్ ఉడుం లెక్క చొర్రిండట‌.. వాళ్ల కార్య‌క‌ర్త‌లే ఆయ‌న‌పై కోపంగున్న‌రు
Advertisement
  • భూముల‌మ్మిన పైస‌లు ఏం చేస్తున్న‌వ్‌.. పిల్ల‌ల ఫీజులు ఇవ్వ‌డానికి మ‌న‌సు వ‌స్త‌లేదా?
  • ఎవ‌రు ఆత్మ‌హ‌త్య చేసుకున్నా నీ బాధ్య‌త‌నే
  • సోయి లేని నిన్ను చూసి జ‌నం ఛీ కొడుతున్న‌రు
  • నీలాంటి కురుస మాటలు మంచిది కాదు
  • ఫీజులు ఇచ్చేదాక నిన్ను వ‌ద‌లం
  • సీఎం రేవంత్‌పై మ‌ల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ ఫైర్‌

Etala Rajendar | త్రినేత్ర‌.న్యూస్‌: కాంగ్రెస్ పార్టీలో రేవంత్‌రెడ్డి ఉడుం లెక్క చొర్రిండని.. వాళ్ల కార్య‌క‌ర్త‌లే ఆయ‌న‌పై కోపంతో ర‌గిలిపోతున్న‌ర‌ని మ‌ల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ విమ‌ర్శించారు. రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసినందుకు తెలంగాణ ప్రజలు కుమిలిపోతూ మ‌రోవైపు ఛీ కొడుతున్నారన్నారు. భూములమ్మితే వచ్చిన వేల కోట్ల రూపాయలు ఏం చేస్తున్నాడోన‌ని ప్ర‌శ్నించారు. పిల్లలకు ఫీజులు ఇవ్వటానికి మనసు రావడం లేదా? అని నిల‌దీశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎవరు ఆత్మహత్య చేసుకున్నా రేవంత్‌రెడ్డే బాధ్యత వ‌హించాల‌న్నారు. ఫీజులు ఇచ్చేదాక వ‌దిలే ప్ర‌స‌క్తే లేద‌న్నారు. మంగ‌ళ‌వారం ఫీజు బ‌కాయి-బీజేపీ ల‌డాయి దీక్ష‌లో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తోలు మందం అయ్యింది. మెడలు వంచాల్సిన సమయమొచ్చింది. డబ్బులిచ్చి పత్రికలు టీవీలు సోషల్ మీడియాలో అనుకూల ప్రచారం చేసుకుంటున్నావు.. కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మా ఆశల మీద నీళ్లు చల్లావని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోయు లేని ముఖ్యమంత్రిని చూసి తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది.

రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారికి 65 సంవత్సరాలు పైబడ్డాయి. విద్యార్థి ఉద్యమాల్లో ఆరితేరిన వ్యక్తి. విద్యార్థి సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉన్నవారు, సమరశీల పోరాటం చేసినవారు ఆయన. పిల్లల భవిష్యత్తు ఏమైతదో అని తల్లిదండ్రులు కంటి మీద కునుకు లేకుండా బిక్కు బిక్కుమంటూ బ‌తుకుతున్నారు. భారతీయ జనతా పార్టీగా ఆ తల్లిదండ్రులకు అండగా ఉండేందుకే ఈ దీక్ష. రాష్ట్రంలో ఏ సమస్య అయినా ప్రజలకు అండగా ఉండే బాధ్యత మాపై ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వసూలు చేసేంతవరకు వదిలిపెట్టేది లేదు.

ప్ర‌ధాని ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్ విద్యార్థుల‌తో మాట్లాడుతున్న‌రు..

పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తే రేషన్ కార్డులు ఇవ్వాల్సిన అవసరం లేదని మహనీయుడు అంబేద్కర్ గారు అన్నారు. విద్యతోనే సమానత్వం వస్తుందని చెప్పారు. ఆ స్పూర్తితో దేశ భవిష్యత్తు తరగతిగదిలో నిక్షిప్తం అయ్యిందని చెప్పిన వారి కొఠారి గారు. పిల్లల "మేధస్సు వికసిస్తే దేశం ఫలిస్తుందని" నమ్మిన మహనీయుడు అబ్దుల్ కలాం గారు. నరేంద్ర మోడీ ప్రధాని అయినా పదవ తరగతి, ఇంటర్ విద్యార్థులతో మాట్లాడుతున్నారు. వారి టెన్షన్ పోగొడుతున్నారు. ప్రపంచంలో అతి ఎక్కువ యువశక్తి ఉంది నాదేశం అని మోదీ గారు గర్వంగా చెబుతున్నారు.

నీకేమైనా జ్ఞానం ఉందా లేదా?

పేద కార్మికులు, పేద రైతులు, పడ్లమ్ముకొనే వారు సైతం గొప్పగా చదువుకోవాలని మా ఈ ఆరాటం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నాలుగుకోట్ల ప్రజలకు తల్లి తండ్రి. ఆ సోయి నీకు లేనందుకు తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది. కేసీఆర్ పెట్టిన బకాయిలు చెల్లించను అని అంటావు. నీకేమైనా జ్ఞానం ఉందా లేదా? పార్టీలు వస్తాయి పోతాయి కానీ ప్రభుత్వాలు మాత్రం శాశ్వతం. సంక్షేమ పథకాలు కొనసాగుతాయి అనే సోయి లేదా. గ్రీన్ ఛానెల్ పెట్టిన అంటావ్ ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదు.

నీలాంటి కురుస మాటలు మంచిది కాదు. పేదవారికి నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో వచ్చిందే కదా ఫీజు రియంబర్స్మెంట్ పథకం. ఆ డబ్బులు వస్తాయనే కూలి చేసుకునే, ఆటో నడుపుకునే, కూరగాయలు అమ్ముకునే వాళ్ళ పిల్లలు కాలేజీల్లో చేరారు. జాయిన్ అయిన తర్వాత ఫీజు ఇవ్వను అంటే వారు ఎటు పోవాలి. కాలేజీలు కూడా సిబ్బంది జీతాలు ఇవ్వలేక ఇబ్బంది పడుతున్నారు. ఫీజులు కట్టలేక పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది పేద విద్యార్థుల సమస్య బుకాయించకుండా డబ్బులు విడుదల చేయండి.

ఆక్స్‌ఫ‌ర్డ్‌ యూనివర్సిటీ క్యాంపస్, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ క్యాంపస్ రాగానే తెలంగాణ బాగు పడుతుందా. ఇక్కడ చదువుకున్న వారు ప్రపంచంలో అనేక పెద్ద పోస్ట్స్ అలంకరించారు. అడోబ్ సీఈవో శాంతను నారాయణ మన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి. గుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ, కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్, వ‌రల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగా, పెప్సికో మాజీ సీఈవో- ఇంద్ర నూయి, మాజీ యూఎస్ సర్జన్ జనరల్ - వివేక్ మూర్తి, ఫెడ్ ఎక్స్ సీఈవో - రాజ్ సుబ్రహ్మణ్యం.. వీరందరూ మన దేశంలో చదువుకున్న వారే. స్కై రూట్ పేరుతో ఆకాశాన్ని జయించింది మన పిల్లలే.

రైతుబంధు ఇవ్వకుండా 60 లక్షల మంది కుటుంబాలను ఏడిపిస్తున్నావు. రైతులు విద్యార్థులు నిరుద్యోగులు తల్లిదండ్రులు ఆటో డ్రైవర్లు ఎవరు ఆత్మహత్యలు చేసుకున్న దానికి బాధ్యత రేవంత్ రెడ్డిది. రాష్ట్రంలో ఏ ఊరికి వెళ్ళినా పొరపాటున రేవంత్ రెడ్డికి ఓటు వేశాం మా చెంప మేమే కొట్టుకుంటున్నాం అని వాపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే.. రేవంత్ రెడ్డి మా పార్టీలో ఉడుం లెక్క చేరిండు.. మరో ఇరవై ఏళ్లు పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా చేశాడు అని అంటున్నారు.

ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు నరేంద్ర మోదీ. ఆయన్నా నువ్వు విమర్శించేది. మరో ఉద్యమం చేసే అవకాశం రానివ్వకుండా వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తున్నాం అని ఈట‌ల రాజేంద‌ర్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement