త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BC | బీసీల ఝూటా పార్టీగా మారిన బీజేపీ.. గ‌ద్దె దింపుతామ‌న్న బీసీ నేత‌లు

BC | భార‌తీయ జ‌న‌తా పార్టీ.. బీసీల ఝూటా పార్టీగా మారింద‌ని బీసీ నేత‌లు నిప్పులు చెరిగారు. బీసీ కుల గ‌ణ‌న చేయ‌ని బీజేపీ ప్ర‌భుత్వాన్ని త‌ప్ప‌కుండా గ‌ద్దె దింపుతామ‌ని హెచ్చ‌రించారు.

S

Telangana | Published On Aug 25, 2026, 7.30 pm IST

BC | బీసీల ఝూటా పార్టీగా మారిన బీజేపీ.. గ‌ద్దె దింపుతామ‌న్న బీసీ నేత‌లు
Advertisement
  • బీసీ లెక్కలు తీయని బీజేపీకి పోయేకాలం దగ్గర పడ్డది
  • మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయకుండా కేంద్రం తొక్కి పెట్టింది
  • బీసీ కాలం లేకుండా కులగలన చేస్తున్నామని కేంద్రం చెప్పడం శుద్ధ అబద్ధం
  • ప్రధాని బీసీలకు మాట ఇచ్చి తప్పడం దుర్మార్గం
  • బీసీ గణన చేసే వరకు కేంద్రాన్ని వదిలేది లేదు
  • హైదరాబాద్‌లోని గన్ పార్క్ వద్ద బీసీ నేత‌ల ఆందోళన

BC | త్రినేత్ర‌.న్యూస్ : భార‌తీయ జ‌న‌తా పార్టీ.. బీసీల ఝూటా పార్టీగా మారింద‌ని బీసీ నేత‌లు నిప్పులు చెరిగారు. బీసీ కుల గ‌ణ‌న చేయ‌ని బీజేపీ ప్ర‌భుత్వాన్ని త‌ప్ప‌కుండా గ‌ద్దె దింపుతామ‌ని హెచ్చ‌రించారు. జాతి జనగణనలో బీసీ కాలం చేర్చకుండా కులగణన చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం చాలా సిగ్గుచేటని, బీసీలను నమ్మించి వంచించిన బీజేపీ ప్రభుత్వానికి పోయేకాలం దాపురించిందని, త్వరలోనే దేశంలోని బీసీలంతా ఒక్కటై బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడం ఖాయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.

హైదరాబాద్‌లోని గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపం దగ్గర బీసీ రిజర్వేషన్ల ఆధ్యులు, బీసీలకు ఆరాధ్యులు అయినటువంటి బీపీ మండల్ 109 వ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన జయంతికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరై బీపీ మండల్ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించిన అర్పించారు. అనంతరం బీపీ మండల్ సిఫారసులను అమలు చేయాలని ఆందోళన చేపట్టారు.

ఈ సంద‌ర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మండల కమిషన్ సిఫార్సులు అమలు చేయకుండా అగ్రకుల ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేస్తున్నాయన్నారు, బీసీ కులగనన చేసి జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆనాడే బీపీ మండల స్పష్టంగా సిఫార్సు చేసిన స్వాతంత్రం సిద్ధించి 80 సంవత్సరాలు గడచినప్పటికీ నేటి వరకు అమలు చేయకపోవడం చాలా సిగ్గుచేటు అన్నారు. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారపక్షంలోకి వచ్చినప్పుడు బీసీ కులగణన చేస్తామని మాట ఇచ్చి తీరా కులగ‌ణ‌న జరుగుతున్న ఈ సమయంలో అస్పష్టంగా, అశాస్త్రీయంగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి అందులో 40 ప్రశ్నలు పొందుపరిచిందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి బీసీలపై చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా బీసీ జాబితా ప్రకటించి, కులాలకు ఒక కోడ్ కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.

బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయాలని 48 గంటల దీక్ష చేస్తున్న బిజెపి అధ్యక్షుడు రామచంద్ర రావును అభినందిస్తున్నామని, ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచిన బిల్లును పార్లమెంటులో ఆమోదించాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న జాతి జనగణనలో బీసీ కులగణన చేపట్టాలని కూడా డిమాండ్ చేయాలన్నారు. బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ఎంత ముఖ్యమో అంతకంటే ఎక్కువగా రిజర్వేషన్లు కులగనణ కూడా అంతే కంటే ఎక్కువ ముఖ్యమన్నారు. బీజేపీకి బీసీలపై చిత్తశుద్ధి ఉంటే ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించి కులగణనపై సానుకూల నిర్ణయం తీసుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని జాజుల డిమాండ్ చేశారు.

ఢిల్లీ పెద్దలపై బీసీల తిరుగుబాటు తప్పదు

మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీ కులాల లెక్కలు తీయడానికి కేంద్రం భయపడుతుందని, బీసీ కులాల లెక్కలు తేలితే రిజర్వేషన్లు కూడా అదే స్థాయిలో పెంచాల్సి ఉంటది అనే విషయం వారికి స్పష్టంగా తెలుసని వారు అన్నారు. స్వాతంత్రం వచ్చి ఇన్ని ఏళ్లు అయిన తర్వాత కూడా బీసీలు మెజార్టీగా ఉండి కూడా అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడడం ప్రజాస్వామ్య వ్యవస్థలో సిగ్గుపడాల్సిన అంశం అని, బీసీల అభివృద్ధి దేశాభివృద్ధిగా చూడాలని వారు కోరారు బీసీ కులగణ‌న చేపట్టకపోతే ఢిల్లీ పెద్దలపై బీసీల తిరుగుబాటు తప్పదని వారు తీవ్రంగా హెచ్చరించారు. బీసీ సంఘాలు చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని మధుసూదనా చారి, శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వహక అధ్య‌క్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ ఆద్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యామ్ కుర్మా, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేష్ యాదవ్, బీసీ జేఏసీ కో చైర్మన్ ఉప్పరి శేఖర్ సగర, సంచార జాతుల సంఘం అధ్యక్షులు కాటేపల్లి వీరస్వామి, బీసీ సంఘాల నేతలు, సంఘాన్ని మల్లేశ్వర్, ముకురాల చంద్రశేఖర్ గౌడ్, రావులకోల్ నరేష్ ప్రజాపతి,తారాకేశ్వరి, భూదాని సదానందం, పానుగంటి విజయ్ గౌడ్, గోధ వరుణ్ గౌడ్, లక్ష్మణ్, సమత యాదవ్, నరసింహ చారి, అంతోష్ బ్రహ్మచారి, ఉదయ్ నేత, శివమ్మ, వరలక్ష్మి, రాజేశ్వరి, అంజమ్మ, బండిగారి రాజు, పద్మావతి, మణికంఠ కుర్మా, నరసమ్మ, కే నారి యాదవ్, జస్వంత్, నవీన్, దినేష్, తదితరులు పాల్గొన్నారు..

Advertisement
Advertisement