China Manja | త్రినేత్ర.న్యూస్ : నిషేధిత చైనా మాంజా ఓ బాలుడి మెడకు చుట్టుకుంది. తీవ్ర గాయాలపాలైన ఆ బాలుడి మెడ చుట్టూ వైద్యులు 20 కుట్లు వేశారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మెట్‌పల్లి పట్టణంలోని దుబ్బవాడలో శ్రీహస్ అనే బాలుడు తన ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. అయితే అంతలోనే చైనా మాంజా వచ్చి బాలుడి మెడకు చుట్టుకుంది. దీంతో తీవ్రంగా గాయపడ్డాడు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం బాధితుడిని నిజామాబాద్‌కు తరలించారు. బాలుడి మెడకు తీవ్ర గాయాలు కావడంతో 20 కుట్లు వేశారు వైద్యులు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.