త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stand With Her | మహిళల భద్రత ప్రభుత్వ యంత్రాంగానిదే కాదు..: ఐపీఎస్ చారు సిన్హా

Stand With Her | మ‌హిళ‌ల భ‌ద్ర‌త కేవ‌లం ప్ర‌భుత్వ యంత్రాంగానిదే కాద‌ని, ప్ర‌తి వ్య‌క్తి త‌మ ప్ర‌వ‌ర్త‌న ద్వారా మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌తా భావం క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీనియ‌ర్ ఐపీఎస్ చారు సిన్హ (IPS Charu Sinha) అన్నారు. మీ ఉనికి ఒక ఎంపిక.. మీ చుట్టూ ఉన్న మహిళలకు మీరు సురక్షిత వాతావరణాన్ని కల్పించాల‌ని వెల్ల‌డించారు.

G

Telangana | Published On Jun 14, 2026, 12.45 pm IST

Stand With Her | మహిళల భద్రత ప్రభుత్వ యంత్రాంగానిదే కాదు..: ఐపీఎస్ చారు సిన్హా
Advertisement

Stand With Her | త్రినేత్ర‌.న్యూస్‌: మ‌హిళ‌ల భ‌ద్ర‌త కేవ‌లం ప్ర‌భుత్వ యంత్రాంగానిదే కాద‌ని, ప్ర‌తి వ్య‌క్తి త‌మ ప్ర‌వ‌ర్త‌న ద్వారా మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌తా భావం క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీనియ‌ర్ ఐపీఎస్ చారు సిన్హ (IPS Charu Sinha) అన్నారు. మీ ఉనికి ఒక ఎంపిక.. మీ చుట్టూ ఉన్న మహిళలకు మీరు సురక్షిత వాతావరణాన్ని కల్పించాల‌ని వెల్ల‌డించారు. మహిళల భద్రత, గౌరవం, సమానత్వంపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహిస్తున్న స్టాండ్ విత్ హ‌ర్ (#StandWithHer) ప్రచారంలో భాగంగా హైద‌రాబాద్‌లోని వీహ‌బ్ (WeHub), డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో జరిగిన `ప్రజా స్థలాలు అందరివే-పురుషుల ఉనికి, వారి ప్రవర్తన (ప్రజా ప్రదేశాల్లో లైంగిక వేధింపులు)` అనే అంశంపై పాల్ చ‌ర్చ‌లో ఐపీఎస్ అధికారి చారు సిన్హ‌, సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల, ది హిందూ బిజినెస్ లైన్ రెసిడెంట్ ఎడిటర్ రిచా మిశ్రా, నటుడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా చారు సిన్హ మాట్లాడుతూ.. తన జీవితంలో అవకాశాలు కల్పించి, అవసరమైన సమయంలో అండగా నిలిచిన పురుషులకు తాను ఎల్లప్పుడూ కృతజ్ఞురాలినని తెలిపారు.

మహిళలు భయపడకుండా స్వేచ్ఛగా సంచరించగల వాతావరణం ఏర్పడాలంటే సమాజం మొత్తం కలిసికట్టుగా పనిచేయాలని దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. మహిళలు సురక్షితంగా ఉన్నారనే నమ్మకాన్ని కలిగించే సామాజిక వాతావరణాన్ని నిర్మించడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.

సమస్యలను స్వేచ్ఛగా చెప్పుకునేలా..

మహిళలు తమ సమస్యలను స్వేచ్ఛగా చెప్పుకునేలా పురుషులు నమ్మకం కలిగించే వాతావరణాన్ని సృష్టించాలని నటుడు, రచయిత, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ సూచించారు. మహిళల మాటలను వినడం, అర్థం చేసుకోవడం, వారికి మద్దతుగా నిలవడం ఎంతో ముఖ్యమని చెప్పారు. మహిళలకు అండగా నిలిచే పురుషుడు బలహీనుడు కాదని, నిజానికి అతడే మరింత బలమైన వ్యక్తి అని రిచా మిశ్రా చెప్పారు. కుటుంబం, కార్యాలయం, సమాజం అనే తేడా లేకుండా మహిళలకు సమాన అవకాశాలు, గౌరవం, భద్రత కల్పించేందుకు పురుషులు భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.

మహిళలపై వివక్ష, వేధింపులు, అన్యాయాల విషయంలో పురుషులు మౌనంగా ఉండకుండా స్పందించాలని వ్యాఖ్యాత ఉమా సుధీర్ కోరారు. మహిళల కోసం నిలబడటం, అన్యాయాన్ని ప్రశ్నించడం నిజమైన బాధ్యతాయుతమైన పురుషత్వానికి నిదర్శనమని చెప్పారు.

Advertisement
Advertisement