త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CP Sajjanar | భద్రత పోలీసుల బాధ్యతే కాదు.. ప్ర‌జ‌లంతా భాగ‌స్వాములు కావాలి : సీపీ స‌జ్జ‌నార్‌

CP Sajjanar | నగర భద్రతలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (HCSC), హైదరాబాద్ సిటీ పోలీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘మార్గదర్శక్’ కార్యక్రమం తొలి బ్యాచ్ సర్టిఫికేషన్ వేడుక ఘనంగా జరిగింది. బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో రెండో బ్యాచ్‌ను కూడా అధికారికంగా ప్రారంభించారు.

P

Hyderabad | Published On Jun 14, 2026, 6.53 pm IST

CP Sajjanar | భద్రత పోలీసుల బాధ్యతే కాదు.. ప్ర‌జ‌లంతా భాగ‌స్వాములు కావాలి : సీపీ స‌జ్జ‌నార్‌
Advertisement

CP Sajjanar | నగర భద్రతలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (HCSC), హైదరాబాద్ సిటీ పోలీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘మార్గదర్శక్’ కార్యక్రమం తొలి బ్యాచ్ సర్టిఫికేషన్ వేడుక ఘనంగా జరిగింది. బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో రెండో బ్యాచ్‌ను కూడా అధికారికంగా ప్రారంభించారు. పబ్లిక్ సేఫ్టీ, ఎమర్జెన్సీ రెస్పాన్స్, మహిళల భద్రత, సైబర్ అవగాహన, కమ్యూనిటీ పోలీసింగ్ వంటి అంశాల్లో శిక్షణ పొందిన ఈ కార్యక్రమంలో తొలి బ్యాచ్‌లో 80 మందికి పైగా పాల్గొని శిక్షణ పూర్తి చేసి సర్టిఫికెట్లు అందుకున్నారు.

కార్యక్రమం ద్వారా శిక్షణ పొందిన వాలంటీర్లు నగరంలో భద్రతా అవగాహన పెంపొందించడంలో కీలక పాత్ర పోషించనున్నట్లు అధికారులు తెలిపారు. మొదటి బ్యాచ్ విజయాన్ని ఆధారంగా తీసుకుని ప్రారంభించిన రెండో బ్యాచ్‌కు ఇప్పటికే మంచి స్పందన లభించింది. మొత్తం 280 మంది నమోదు కావడం విశేషం. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్, హెచ్‌సీఎస్‌సీ చైర్మన్ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ ప్రజల భద్రత కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, సమాజం మొత్తం భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ‘మార్గదర్శక్’ వంటి కార్యక్రమాలు పోలీసు–ప్రజల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

వివిధ పోలీస్ విభాగాలైన షీ టీమ్స్, భరోసా కేంద్రాలు, సైబర్ క్రైమ్ యూనిట్లతో ప్రజలకు వేగంగా సహాయం అందేలా ‘పోలీస్ మెంటర్స్ ప్రోగ్రామ్’ను ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఒక కానిస్టేబుల్ మార్గదర్శకులకు మెంటర్‌గా పనిచేస్తారని తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌సీఎస్సీ సెక్రటరీ జనరల్ సీ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ నగర భద్రతలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని అన్నారు. సరైన అవగాహనతో ప్రజలను భాగస్వాములను చేయడం ద్వారా హైదరాబాద్ నగరం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమానికి పోకర్నా గ్రూప్ స్పాన్సర్‌గా వ్య‌వ‌హ‌రించింది.

Advertisement
Advertisement