త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG Inter Exams | ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

TG Inter Exams | తెలంగాణ ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగించిన‌ట్లు ఇంట‌ర్ బోర్డు అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. రూ. 3 వేల ఆల‌స్య రుసుంతో మే 4వ తేదీ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష ఫీజును స్వీక‌రించ‌నున్న‌ట్టు బోర్డు అధికారులు తెలిపారు.

S

Telangana | Published On May 2, 2026, 4.30 pm IST

TG Inter Exams | ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు
Advertisement

TG Inter Exams | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగించిన‌ట్లు ఇంట‌ర్ బోర్డు అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. రూ. 3 వేల ఆల‌స్య రుసుంతో మే 4వ తేదీ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష ఫీజును స్వీక‌రించ‌నున్న‌ట్టు బోర్డు అధికారులు తెలిపారు. విద్యార్థులు సంబంధిత కాలేజీల్లో ఫీజులు చెల్లించాల‌ని సూచించారు.

ఇక మే 13 నుంచి 21 వ‌ర‌కు స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. మే 22 నుంచి 25 వ‌ర‌కు ప్రాక్టిక‌ల్ ఎగ్జామ్స్ నిర్వ‌హించ‌నున్నారు. ప్రాక్టిక‌ల్స్ రెండు ద‌శ‌ల్లో ఉద‌యం 9 నుంచి 12 వ‌ర‌కు, మ‌ధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి. ప్ర‌థ‌మ సంవ‌త్స‌రం విద్యార్థుల‌కు ఇంగ్లీష్ ప్రాక్టిక‌ల్ ఎగ్జామ్ మే 26న ఉద‌యం 10 గంట‌ల‌కు, ద్వితీయ సంవ‌త్స‌రం విద్యార్థుల‌కు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి నిర్వ‌హించ‌నున్నారు.

Advertisement
Advertisement