త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indiramma Illu | కుమారుడికి లండ‌న్‌లో జాబ్.. కూతురికి క‌రెంట్ డిపార్ట్‌మెంట్‌లో జాబ్.. త‌ల్లికి ఇందిర‌మ్మ ఇల్లు

Indiramma Illu | క‌డు నిరుపేద‌ల‌కు గూడు క‌ల్పించేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఇందిర‌మ్మ ఇల్లు ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌థ‌కం కింద అత్యంత నిరుపేద‌లై ఉండి.. స్థ‌లం ఉండి ఇల్లు నిర్మించుకోలేని వారు అర్హులు. అంతేకాదు తెల్ల రేష‌న్ కార్డు త‌ప్ప‌నిస‌రి.

S

Telangana | Published On May 1, 2026, 12.47 pm IST

Indiramma Illu | కుమారుడికి లండ‌న్‌లో జాబ్.. కూతురికి క‌రెంట్ డిపార్ట్‌మెంట్‌లో జాబ్.. త‌ల్లికి ఇందిర‌మ్మ ఇల్లు
Advertisement

Indiramma Illu | త్రినేత్ర‌.న్యూస్ : క‌డు నిరుపేద‌ల‌కు గూడు క‌ల్పించేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఇందిర‌మ్మ ఇల్లు ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌థ‌కం కింద అత్యంత నిరుపేద‌లై ఉండి.. స్థ‌లం ఉండి ఇల్లు నిర్మించుకోలేని వారు అర్హులు. అంతేకాదు తెల్ల రేష‌న్ కార్డు త‌ప్ప‌నిస‌రి. ఇంట్లో ఎవ‌రైనా ఉద్యోగ‌స్తులు ఉంటే వారు ఇందిర‌మ్మ ఇల్లుకు అన‌ర్హులు.

కానీ.. కుమారుడికి లండ‌న్‌లో జాబ్.. కూతురు డిపార్ట్‌మెంట్‌లో జాబ్.. త‌ల్లికి ఇందిర‌మ్మ ఇల్లు మంజూరు.. భలే ఉంది క‌దా..! మ‌రి ఎక్క‌డో కాదు.. సాక్షాత్తు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా ఖ‌మ్మంలోని ఓ ల‌బ్ధిరాలు చెప్పిన మాట ఇది.

ఇందిర‌మ్మ ఇల్లు మంజూరైన సంద‌ర్భంగా నిన్న పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలో స‌మావేశం నిర్వ‌హించారు. ల‌బ్ధిరాలు ప్ర‌సంగిస్తూ.. త‌న‌కు ఇందిర‌మ్మ ఇల్లు మంజూరు చేసినందుకు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు అని పేర్కొంటూ సెల‌విచ్చారు. అనంత‌రం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క‌ల్పించుకుని.. మీ పిల్ల‌లు ఏం చేస్తార‌మ్మా అని అడిగిన‌ప్పుడు ఆమె ఇలా చెప్పింది.

నా కొడుకు లండన్‌లో జాబ్ చేస్తున్నాడు.. కూతురు కరెంట్ డిపార్ట్‌మెంట్‌లో జాబ్ చేస్తుందని, తనకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. నేను ఇప్ప‌టి వ‌ర‌కు పెంకుటిల్లులోనే ఉంటున్నాను. తనకు ఇప్పటివరకు ఇల్లు లేదని, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపి త‌న మ‌నోభావాన్ని తెలియ‌జేసింది ఆమె.

Advertisement
Advertisement