Rain Alert | నేడు, రేపు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
Rain Alert | ఎండలు, ఉక్కబోతతో సతమతమవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ (IMD) చల్లని కబురు అందించింది. బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం (Rain Alert) ఉందని తెలిపింది.
Rain Alert | త్రినేత్ర.న్యూస్: ఎండలు, ఉక్కబోతతో సతమతమవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ (IMD) చల్లని కబురు అందించింది. బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం (Rain Alert) ఉందని తెలిపింది. క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వెల్లడించింది. ఈ నెల 4న కేరళలోకి నైతురి రుతుపవనాల (Southwest Monsoon) ప్రవేశానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని, ఆ తరువాత వారం రోజులకు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం అవకాశం ఉందని పేర్కొంది.
బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశాలున్నట్లు పేర్కొంది. దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. కాగా, రానున్న 4 రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉందని తెలిపింది.
4న కేరళను తాకనున్న రుతుపవనాలు..
దేశవ్యాప్తంగా వర్షాకాలం (Rainy Season) ప్రారంభానికి సంకేతమైన నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) జూన్ 4న కేరళ తీరాన్ని తాకనున్నాయని అధికారికంగా ప్రకటించింది. కాస్త ఆలస్యంగా వస్తున్నప్పటికీ, ఈ రుతుపవనాల ఎంట్రీతో దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తాజా బులెటిన్‌లో వెల్లడించింది.
భారీ వర్షాలు
రుతుపవనాల రాకతో కేరళ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం పడనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాబోయే ఆరేడు రోజుల పాటు కేరళలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఏకంగా 7 సెం.మీ నుంచి 20 సెం.మీ వరకు వర్షపాతం నమోదు కావొచ్చని వాతావరణ శాఖ 'అలర్ట్' (Alert) జారీ చేసింది. అరేబియా సముద్రం మీదుగా ఉత్తరం వైపు వీస్తున్న గాలులు బలపడుతుండటంతో.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ స్పష్టం చేసింది.
కాగా, వర్షాలతో ఒకవైపు ఉపశమనం లభిస్తున్నప్పటికీ, ఇంకోవైపు ప్రతికూల వాతావరణ పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. రాబోయే వారం రోజుల్లో వాయువ్య, మధ్య, తూర్పు భారతదేశంతో పాటు దక్షిణ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉండటంతో.. చెట్లు, తాత్కాలిక షెడ్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా (Alert) ఉండాలని అధికారులు సూచించారు.
ఇవికూడా చదవండి..
రెండు శాఖల్లో 290 ఇంజినీర్ కొలువులు.. టీజీపీఎస్సీ నోటిఫికేషన్లు
వేసవికి నేటితో ముగింపు.. రేపటి నుంచి తెలంగాణలో వర్షాలే వర్షాలు
గుడ్ న్యూస్: జూన్ 4న కేరళను తాకనున్న రుతుపవనాలు.. ఆ రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వానలు!
తాజావార్తలు
- ●Peddi Review | పెద్ది రివ్యూ - రామ్‌చరణ్ ఆట అదిరింది.. కానీ కిక్కు మిస్సయ్యింది - జాన్వీ కపూర్ మైనస్!
- ●Mumbai Water Crisis | ముంబై మహా నగరానికి ముంచుకొస్తున్న నీటి గండం? దారుణంగా పడిపోయిన నీటి మట్టాలు
- ●Kevin Kunta | రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్ కుంట ఎవరు? 'పెద్ది' ఈవెంట్లో జాన్వీ కపూర్‌ను ఎలా కాపాడాడు?
- ●DK Shivakumar | కర్నాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు.. విద్య, ఉద్యోగం, రైతులపై డీకే ఫోకస్..!
- ●Raghunandan Rao | రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలు: ఎంపీ రఘునందన్ రావు
- ●Foreigners’ Registration | ఆ పత్రాలు సమర్పించాల్సిందే.. ఇమ్మిగ్రేషన్ చట్టంపై పోలీసుల వార్నింగ్..!

Peddi Review | పెద్ది రివ్యూ - రామ్‌చరణ్ ఆట అదిరింది.. కానీ కిక్కు మిస్సయ్యింది - జాన్వీ కపూర్ మైనస్!

Mumbai Water Crisis | ముంబై మహా నగరానికి ముంచుకొస్తున్న నీటి గండం? దారుణంగా పడిపోయిన నీటి మట్టాలు

Kevin Kunta | రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్ కుంట ఎవరు? 'పెద్ది' ఈవెంట్లో జాన్వీ కపూర్‌ను ఎలా కాపాడాడు?

DK Shivakumar | కర్నాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు.. విద్య, ఉద్యోగం, రైతులపై డీకే ఫోకస్..!





