Heat Wave | సూర్యప్రతాపం.. నేడు, రేపు మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు
Heat Wave | రాష్ట్రంపై సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే నిప్పులు (Heat Wave) చిమ్ముతున్నాడు. ఇక మధ్యాహ్నం వేళ బయట అడుగు పెట్టాలంటేనే జనం భయపడుతున్నారు.
Heat Wave | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంపై సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే నిప్పులు (Heat Wave) చిమ్ముతున్నాడు. ఇక మధ్యాహ్నం వేళ బయట అడుగు పెట్టాలంటేనే జనం భయపడుతున్నారు. రోజురోజుకు ఎండ వేడి పెరుగుడటంతో గాలిలో తేమ శాతం పడిపోతున్నది. దీంతో వడగాలులు వీస్తుండటంతో పిల్లలు, వృద్ధులు వేడికి తట్టుకోలేకపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళ, బుధవారాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, 41 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదవుతాయని హైదరాబాద్ తావరణ కేంద్రం (IMD Hyderabad) తెలిపింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) జారీచేసింది.
యాదాద్రి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, ములుగు, జయశంకర్, జనగామ, కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాద్ జిల్లాల్లో 36 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయిని తెలిపింది. మిగిలిన అన్ని జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాలతోపాటు నల్లగొండ, సూర్యాపేట, గద్వాల జిల్లాల్లో ఎండ తీవ్రత అత్యధికంగా ఉంటుందని పేర్కొంది. దీనికితోడు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉండటంతో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు.
మధ్యాహ్నం వేళల్లో జాగ్రత్త
మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళితే టోపీ ధరించాలని, లేకపోతే గొడుగు ఉంచుకోవాలని తెలిపారు. నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలని, మజ్జిగ లాంటివి తీసుకోవాలని సూచించారు. ఎండ ప్రభావంతో పాటు వడగాలుల వల్ల వడదెబ్బ బారిన పడే అవకాశముందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నా.
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) April 13, 2026
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



