త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Weather Update | రాష్ట్రంలో మ‌రో మూడు రోజులు ఎండ‌లే ఎండ‌లు..

Weather Update | రాష్ట్రంలో ఎండ‌లు (Heat Wave) దంచికొడుతున్నాయి. మ‌రో మూడు రోజులు గ‌రిష్ట ఉష్ణోగ్ర‌తలు (High Temperatures) న‌మోద‌వుతాయిన హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం (IMD) తెలిపింది.

G

Telangana | Published On Apr 26, 2026, 1.11 pm IST

Weather Update | రాష్ట్రంలో మ‌రో మూడు రోజులు ఎండ‌లే ఎండ‌లు..
Advertisement

Weather Update | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో ఎండ‌లు (Heat Wave) దంచికొడుతున్నాయి. మ‌రో మూడు రోజులు గ‌రిష్ట ఉష్ణోగ్ర‌తలు (High Temperatures) న‌మోద‌వుతాయిన హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం (IMD) తెలిపింది. ప‌లు జిల్లాల్లో ఏప్రిల్ 29 వ‌ర‌కు 41 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వెల్ల‌డించింది. 20కి పైగా జిల్లాల్లో ఎండ‌ తీవ్ర‌త‌ అధికంగా ఉంటుంద‌ని, ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వ‌ర‌కు పెరిగే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేసింది. సాయంత్రం లేదా రాత్రి వేళల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలుల‌తో కూడిన తేలిక‌పాటి నుంచి మోస్తారు వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని వెల్ల‌డించింది. దీనివ‌ల్ల వేస‌వి తాపం నుంచి కొంత ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంద‌ని తెలిపింది. నెలాఖ‌రు వ‌రకు వాతావ‌ర‌ణం ఇలాగే కొన‌సాగుతుంద‌ని పేర్కొంది.

ఈ నెల 29 వ‌ర‌కు యాదాద్రి, వ‌రంగ‌ల్‌, వికారాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట‌, సూర్యాపేట‌, వికారాబాద్‌, న‌ల్ల‌గొండ‌, మ‌హ‌బూబాబాద్‌, మేడ్చ‌ల్‌, హైద‌రాబాద్‌, హ‌నుమ‌కొండ జిల్లాలు మిన‌హా.. మిగిలిన జిల్లాల్లో 41 నుంచి 44 డిగీల్ర ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతాయ‌ని వెల్ల‌డించింది.

ఆది, సోమ‌వారాల్లో ములుగు, కొత్త‌గూడెం, ఖ‌మ్మం, వికారాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, మంచిర్యాల‌, నిర్మ‌ల్‌, సిద్దిపేట‌, యాదాద్రి, రంగారెడ్డి, హైద‌రాబాద్‌, మేడ్చ‌ల్‌, వికారాబాద్, సంగారెడ్డి, మెద‌క్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోకూడిన మోస్తారు వ‌ర్షం కురుస్తుంద‌ని తెలిపింది. 30 నుంచి 40 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయ‌ని వెల్ల‌డించింది.

Advertisement
Advertisement