Vaddiraju Ravichandra | నిరంకుశ విధానాలను ఎండగట్టిన ధీర వనిత.. ఐలమ్మ
Vaddiraju Ravichandra | భూస్వాములు,పెత్తందారుల నిరంకుశ విధానాలను ఎండగట్టిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, ధీర వనిత చాకలి ఐలమ్మ అని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు.
- జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి ఘన నివాళి అర్పించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
- తెలంగాణ భవన్‌లో పాల్గొన్న ఎంపీ వినోద్‌కుమార్, బీఆర్ఎస్ నేతలు
Vaddiraju Ravichandra | త్రినేత్ర న్యూస్: భూస్వాములు,పెత్తందారుల నిరంకుశ విధానాలను ఎండగట్టిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, ధీర వనిత చాకలి ఐలమ్మ అని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వీర వనిత ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా జరిపి ఆమె ధీరత్వాన్ని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పారన్నారు. శనివారం ఆమె జయంతి సందర్భంగా ఐలమ్మకు ఘన నివాళులర్పించారు. ఆమె పోరాట స్ఫూర్తిని ఒక ప్రకటనలో కొనియాడారు.
బీసీలు, సబ్బండ వర్గాల సంక్షేమం, సముద్ధరణకు కేసీఆర్ తన హయాంలో పలు కార్యక్రమాలు, పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేశారు. మహానేత కేసీఆర్ బీసీ వర్గాలకు చెందిన మధుసూదనాచారిని స్పీకర్ గా, స్వామిగౌడ్ ను కౌన్సిల్ ఛైర్మన్ గా, పద్మారావు గౌడ్, జోగు రామన్న, గంగుల కమలాకర్, శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ లను మంత్రులుగా, కే.కేశవరావు, డీ.శ్రీనివాస్, బండా ప్రకాష్ ముదిరాజ్, బడుగుల లింగయ్య యాదవ్ లతో పాటు తనను పెద్దల సభ రాజ్యసభకు పంపి గౌరవించారు. ఐలమ్మ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజానీకం కేసీఆర్ సుపరిపాలనను గుర్తు చేసుకుంటున్నారు అని వద్దిరాజు పేర్కొన్నారు.
తెలంగాణ భవన్‌లో..
మరోవైపు వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు తెలంగాణ భవన్ లో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీలు బి. వినోద్ కుమార్, రావుల చంద్రశేఖర్ రెడ్డి, టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్, బీఆర్ఎస్ నేతలు కాంభోజి వెంకటేశ్వర్లు, అన్నపూర్ణ, మమత నిఖిల్, విద్యాసాగర్, శాంతి నాయక్, రజిత రావు తదితరులు ఆ మహనీయురాలి చిత్ర పటానికి నివాళులర్పించారు.
తాజావార్తలు
- ●UPI Payment Splitting Risk | చార్జీలు తప్పించుకునేందుకు ఒకే బిల్లును పదే పదే రూ.2000 చొప్పున స్ప్లిట్ చేసి పేమెంట్ చేయొచ్చా?
- ●DGP CV Anand | గణేశ్ నిమజ్జనాల్లో అపశృతి.. 13 మంది మృతి : డీజీపీ సీవీ ఆనంద్
- ●EPF | పెరిగిన పీఎఫ్ పరిమితితో ఖాతాపై ప్రభావం.. లాభమా, నష్టమా..?
- ●Keerthy Suresh | ఇద్దరు మగాళ్లు ప్రేమలో పడితే - తెలుగులో రిలీజ్ అవుతోన్న కీర్తి సురేష్ వివాదాస్పద సినిమా
- ●INDIA | సీఈసీ రాజీనామాకు డిమాండ్.. సెప్టెంబర్ 30న ఇండీ కూటమి కీలక భేటీ
- ●Vinodkumar | సీఈసీ స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి

UPI Payment Splitting Risk | చార్జీలు తప్పించుకునేందుకు ఒకే బిల్లును పదే పదే రూ.2000 చొప్పున స్ప్లిట్ చేసి పేమెంట్ చేయొచ్చా?

DGP CV Anand | గణేశ్ నిమజ్జనాల్లో అపశృతి.. 13 మంది మృతి : డీజీపీ సీవీ ఆనంద్

EPF | పెరిగిన పీఎఫ్ పరిమితితో ఖాతాపై ప్రభావం.. లాభమా, నష్టమా..?

Keerthy Suresh | ఇద్దరు మగాళ్లు ప్రేమలో పడితే - తెలుగులో రిలీజ్ అవుతోన్న కీర్తి సురేష్ వివాదాస్పద సినిమా







